close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బ్రేకింగ్ న్యూస్: ఉగ్ర కలకలంతో తిరుపతిలో హై అలర్ట్ !!

పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు చైన్నైపట్టణంలో ప్రవేశించారని  ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించడంతో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

Updated: Aug 24, 2019, 08:15 AM IST
బ్రేకింగ్ న్యూస్: ఉగ్ర కలకలంతో తిరుపతిలో హై అలర్ట్ !!

తిరుపతి: దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు ప్రవేశించారంటూ నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు జారీ అవుడంతో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.  తాజాగా తమిళానాడులో ఉగ్ర కలకలం రేగడంతో అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. చెనై నగరానికి సమీపంలో తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం ఉండటంతో అక్కడ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రతా చర్యల్లో భాగంగా తిరుపతి పట్టణ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నుంచి తిరుమల, శ్రీకాళహస్తి క్షేత్రాలకు వంటి వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ కోరారు.

కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో భారత పై ఆగ్రహంతో రగిలిపోతున్న దయాది దేశం పాక్.. చేతులు నలుపుకోవడం తప్పితే ఏం చేయలేకపోతోంది. అంతర్జాతీయ వేదికగా పై భారత్ ను విలన్ గా చూపించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు తిరగబడటంతో దిక్కుతో తోచని స్థితిలో ఉన్న ఇమ్రాన్ సర్కార్.. ఏం చేయాలో పాలుపోక ఉగ్రమూకలను ఉసిగొల్పుతోంది. ఇలా పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు గత కొన్ని రోజులుగా భారత్ లో దాడులకు తెగబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవలె ఐఎస్ఐ ఏజెండ్ తో కలిసి నలుగురు ఉగ్రమూలకు భారత్ లో ప్రవేశించారనే ఇంటెలిజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో భారత హోం శాఖ అప్రమత్తమైంది. రద్దీ ప్రాంతాల్లో  బలగాలు మొహరించి డేగ కన్నువేసి ఉంచింది. అయితే తాజాగా చైన్నైలో ఉగ్ర కలకలం రేగడంతో  హోంశాఖ మరింత అప్రమత్తమైంది.