Chittoor Firing Incident: చిత్తూరు కాల్పుల ఘటనలో ట్విస్ట్.. దొంగలు కాదు సుపారీ గ్యాంగ్..

Chittoor Firing Incident: చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక మలుపు  చోటు చేసుకుంది. లక్ష్మీ సినిమా హాల్‌ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2025, 02:05 PM IST
Chittoor Firing Incident: చిత్తూరు కాల్పుల ఘటనలో ట్విస్ట్.. దొంగలు కాదు సుపారీ గ్యాంగ్..

Chittoor Firing Incident: చిత్తూరు జిల్లాలో సంచలన సంఘటన చోటు చేసుకుంది.  అక్కడ ఉన్న  ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరులోని  గాంధీ రోడ్డులో ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.

Add Zee News as a Preferred Source

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చంద్రశేఖర్‌ ఇంట్లో దోపిడీకి ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్‌ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కర్ణాటక, ఉత్తారాదికి చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. రబ్బర్‌ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి యత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రెండున్నర గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించారు. దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

అర్ధరాత్రి దాటాక ఈ దొంగల ముఠా ఐడీబీఐ బ్యాంకు పక్కనే ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తోంది. అలాగే దొంగలు గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికంగా కలకలం రేపింది. ఈలోపు ఆ బిల్డింగ్‌ యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు చాకచక్యంగా ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.  

అంతకు ముందు ఈ ఘటనపై మరో వాదన కూడా వినిపిస్తోంది.. దొంగలు చొరబడిన ఇంటి పక్కనే బ్యాంక్ ఉండటంతో.. వారు దోపిడీకి వచ్చారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బ్యాంకు చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు. దొంగలను పట్టుకునేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ దొంగలు ఆ ఇంట్లో కొంతమందిని బందీలుగా చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.  ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులు దొంగలను పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News