Hot Summer: గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35డిగ్రీల నుంచి 21 డిగ్రీల వరకు ఉంటాయని అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం అత్యధికంగా భద్రచలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు మాడుపగిలే సమాచారం ఇచ్చింది భారత వాతావరణశాఖ. ఈ వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాల పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతాయని హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే ఎండ మండిపోయాయి. పలుచోట్ల వడగాలులు కొనసాగాయి. ఈ మూడు నెలలు అంటే... మార్చి నుంచి మే వరకూ ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని వాతావరణశాఖ అంచనావేసింది.
తెలుగు రాష్ట్రాల్లే కాకుండా దేశంలో ఐదింట నాలుగొంతుల ప్రాంతం వడగాడ్పుల ప్రభావానికి గురికానుందని తెలిపింది. దక్షిణ భారతావనిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలకు సంబంధించి భారత వాతావరణ శాఖ అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు పెరిగాయి. మార్చిలోనే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఈ నెల నుంచే వేసవి ప్రభావం చూపుతూ, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో భానుడు భగ్గుమనే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గత వారం నుంచి రోజు రోజుకీ 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఫిబ్రవరి నెలలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెలలో సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 27.58 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తగ్గింది. దీంతో భూమిలో, గాలిలో తేమశాతం తగ్గడం దేశంలో వేడి పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మార్చి వరకూ చూస్తే దేశంలో ఎండలు పెరగడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. దీంతో వాయవ్య, మధ్య భారతం దానికి ఆనుకుని దక్షిణాదిలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గతేడాది కంటే మరింత తీవ్రంగా ఎండలు, వడగాడ్పులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే మార్చిలో దక్షిణ, మధ్య భారతంలో అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగా, ఉత్తరాదిలో కొన్నిచోట్ల సాధారణంగా, మిగిలినచోట్ల తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
వేసవి సీజన్‌లో ప్రధానంగా మార్చి నుంచి మే వరకూ అనేక ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. అయితే దక్షిణాదిలో తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో హిమాలయాలకు ఆనుకుని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువ నమోదవుతాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగానే ఉంటాయని, వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









