APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

APPSC Group 1 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్ధులకు బిగ్ అప్‌డేట్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2025, 10:51 AM IST
APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

APPSC Group 1 Mains: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలై వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్ధులు తమ హాల్ టికెట్లను https://applications-psc.ap.gov.in/Download_HallTickets/ ద్వారా పొందవచ్చు.

Add Zee News as a Preferred Source

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే 3 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 7 పరీక్షలు రాష్ట్రంలోని 4 జిల్లాల్లో జరగనున్నాయి. మే 3 నుంచి మే 9 వరకు రోజూ ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో  5 ప్రధాన పేపర్లతో పాటు తెలుగు, ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ పేపర్లు ఉంటాయి. 5 పేపర్లలో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే ఇక ఫైనల్ ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 180 నిమిషాల సమయం ఉంటుంది. 

ఏపీలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది మార్చ్ 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 1,48,881 మంది హాజరయ్యారు. వీరిలో 4,496 మంది అర్హత సాధించారు. 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల షెడ్యూల్

మే 3 తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్
మే 4 ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ పేపర్
మే 5 పేపర్ 1 జనరల్ ఎస్సే
మే 6 పేపర్ 2 భారతదేశ చరిత్ర, కల్చరల్, జియోగ్రఫీ
మే 7 పేపర్ 3 పాలిటిక్స్, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్
మే 8 పేపర్ 4 భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి
మే 9 పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం

Also read: AP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News