)
Husband Brutally Beating wife in Kaluzuvvalapadu Prakasam: ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య చోటుచేసుకుంటున్న అనేక ఘటనలు వార్తల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల భార్యలు తమభర్తల్ని వేధిస్తుంటే, మరికొన్నిచోట్ల భర్తలు తమ భార్యల పట్ల సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రతిరోజుకూడా భార్యభర్తల గొడవలు, హత్యలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. దీంతో అసలు పెళ్లి అంటేనే చాలా మంది యువత భయంతో దూరంగా పారిపోతున్నారు.ఈ నేపథ్యంలో ఏపీలో అత్యంత ఘోరమైన, సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీలో దారుణం!
భార్యను తాళ్లతో కట్టేసి బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ చిత్రహింసలకు గురిచేసిన భర్త
ఈ ఘటన ప్రకాశం తర్లుపాడు మండలంలో కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. pic.twitter.com/2rLZeemU01
— greatandhra (@greatandhranews) September 16, 2025
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలంలో కలుజువ్వలపాడు ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఎస్సీ కాలనీలో ఉంటున్న గురునాథం తన భార్యను దారుణంగా కొట్టాడు. ఇంట్లో రెండు దూలాలకు కట్టేసి భార్యను చిత్రహింసలకు గురిచేశారు. బెల్ట్ తో కొడుతూ, కాలితో తన్నూతూ దారుణంగా ప్రవర్తించాడు. ఆమె పాపం దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతూంటే మరింత ఘోరంగా కొట్టాడు.
అయితే.. గురునాథంకు ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతంమరో మహిళతో హైదరాబాద్ లో ఉంటున్నాడు. భార్య కలుజువ్వలపాడులోని బేకరీలో పనిచేస్తు పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకుంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడుల్లా గంజాయి మత్తులో .. బేకరీలో పనిచేసిన డబ్బులు ఇవ్వాలని కొడుతూ వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో భార్యను కొడుతున్న ఘటనను కొంత మంది సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈఘటనపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. వెంటనే అతనిపై కేసు నమోదుచేసి, నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది వాడసలు మనిషేనా అంటూ ఫైర్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook