Heavy Rainfall: నైరుతి రుతుపవనాలు ముందే కేరళ తీరాన్ని తాకాయి. మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి. రానున్న 48 గంటల్లో రుతు పవనాలు రాయలసీమను తాకనున్నాయి. ఫలితంగా వచ్చే రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతు పవనాలు ఇప్పటికే కేరళను తాకాయి. మరో రెండ్రోజుల్లో రుతు పవనాలు ఏపీ, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. ఎప్పుడూ జూన్ 1న ప్రవేశించే రుతు పవనాలు ఈసారి 8 రోజుల ముందే కేరళను తాకాయి. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత చురుగ్గా ఉండటం వల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
దీనికితోడు ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27వ తేదీన ఏర్పడనున్నఅల్పపీడనం క్రమంగా బలపడనుంది. దాంతో వచ్చే వారం రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇటు రుతు పవనాలు, అటు అల్పపీడనం కారణంగా వచ్చే రెండ్రోజులు కుండపోతగా వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.
ఇటు అరేబియా సముద్రంలో కూడా రానున్న 3 రోజుల్లో అల్పపీడన పరిస్థితులు ఉండటంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా ముందుకు కదలనున్నాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: Pawan Kalyan Warning: తెలుగు సినిమా పెద్దలకు పవన్ వార్నింగ్, బయటపడిన నిజ స్వరూపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









