Heavy Rains Alert: గతంతో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందుగానే వచ్చాయి. దానికితోడు విస్తారంగా వర్షాలు కూడా పడ్డాయి. అయితే ఓ పది రోజుల నుంచి రుతు పవనాలు మందగించడంతో పరిస్థితి మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఇప్పుడు మళ్లీ వాతావరణం మారుతోంది. వర్షాలు ప్రారంభమయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి వాతావరణం పూర్తిగా మారిపోనుందని ఐఎండీ తెలిపింది. రానున్న రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. ఈ నెల 18, 19 తేదీల్లో మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ నెల 20 తరువాత అల్పపీడనంగా మారనుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక పార్వతీపురం మన్యం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయి. నిన్న రాత్రి కూడా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 64 మిల్లీమీటర్లు, పల్నాడులో 61.7 మిల్లీమీటర్లు, చిత్తూరులో 54 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ అంటే జూన్ 13న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: Ahmedabad Plane Crash: ఆలస్యం విషం కాదు అమృతమే. ప్రాణాలు దక్కించుకున్న యువతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









