IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో 5 రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్షాలు

IMD Rains Alert: ఓ వైపు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు ముందుగానే వచ్చేశాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 4-5 రోజులు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2025, 07:44 PM IST
IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో 5 రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్షాలు

IMD Rains Alert: నైరుతి రుతు పవనాలు ప్రభావంతో  భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో అంటే ఈ నెల 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. 

Add Zee News as a Preferred Source

నైరుతి రుతు పవనాలు కేరళను తాకగానే అటు మహారాష్ట్రకు చేరుకున్నాయి. సాధారణం కంటే 8 రోజులు ముందుగా ప్రవేశించడమే కాకుండా చురుగ్గా ఉండటంతో భారీగా, విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రుతు పవనాలు ఇంత త్వరగా రావడం దాదాపు 35 ఏళ్ల తరువాత ఇదే. ఫలితంగా ముంబై, పూణేలో భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్న ఢిల్లీలో కూడా భారీ వర్షం పడింది. రానున్న కొద్ది గంటల్లో ముంబైలో ఉరుములు మెరుపులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. 

మే 31వరకు కర్ణాటక మైసూరు జిల్లాలోని స్కూల్స్ , కళాశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు కేరళలో కూడా ఇదే పరిస్థితి. 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రానున్న 5 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. 

ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరిక

ఏపీలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

Also read: Heavy Rains Warning: భారీ నుంచి అతి భారీ వర్షాలు జాగ్రత్త, ఆ రాష్ట్రాల్లో స్కూల్స్ బంద్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News