Heavy Rains Alert: వాయుగుండం అలర్ట్, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు జాగ్రత్త

Heavy Rains Alert: ఓ వైపు నైరుతి రుతు పవనాలు మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో వాతావరణం తీవ్రంగా మారనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2025, 05:50 PM IST
Heavy Rains Alert: వాయుగుండం అలర్ట్, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు జాగ్రత్త

Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఫలితంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం క్రమంగా బలపడనుంది. మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. క్రమంగా రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అక్కడి నుంచి వాయుగుండంగా మారవచ్చని తెలుస్తోంది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే నైరుతి రుతు పవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, సెంట్రల్ కోస్తా, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జూన్ రెండో వారం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి 

దక్షిణ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం, తుపానుల కారణంగా భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అటు తెలంగాణలో కూడా రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. అదిలాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిద్ధిపేట, వికారాబాద్,మెదక్ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. 

Also read: IT Returns: ఐటీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి, గడువు తేదీ ఎప్పుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News