International Yoga day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబు.. హాజరు కానున్న ప్రధాని మోడీ..

International Yoga day 2025: ప్రపంచంలోని అనేక విద్యలకు వేదభూమి అయిన భారత దేశం నిలయం. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆచరిస్తున్న యోగాను పరిచయం చేసింది ఈ వేదభూమినే.ఈ సారి విశాఖ కేంద్రంగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానిని ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి ఈ యోగా డే కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా  పాల్గొని యోగాసనాలు వేయనున్నారు.   

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 18, 2025, 12:31 PM IST
International Yoga day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబు.. హాజరు కానున్న ప్రధాని మోడీ..

International Yoga day 2025:  అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖలోని బీచ్ రోడ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేలాది మంది ఈ యోగాడేల ఉత్సాహంగా పాల్గొనబోతున్నారు. ఇక 2014లో తొలిసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాకా నరేంద్ర మోడీ.. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు. దానికి ప్రపంచ దేశాలు ఆమోదం తెలిపాయి. అప్పటి నుంచి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది 12వ ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సారి విశాఖ కేంద్రంగా జరిగే యోగా దినోత్సవాల్లో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 

Add Zee News as a Preferred Source

ఇప్పటికే స్థానిక అధికారులు ఆర్కే బీచ్, బీచ్ రోడ్, కళాభవన్ చుట్టూ విద్యార్ధులు, ప్రభుత్వ అధికారులు, యోగా ట్రైనర్స్ అందరూ ఈ యోగాడేలో పాల్గొనబోతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచి ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొనవారే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. అంతేకాదు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి విషయాలను పోలీసులు ముందుగానే క్రాస్ చెక్ చేయనున్నారు. 

ఆపరేషన్ సింధూర్ తర్వాత మూడు దేశాల పర్యటన తర్వాత ప్రధాన మంత్రి మన దేశంలో పాల్గొన అతిపెద్ద ఈవెంట్ యోగాడే కావడంతో విశాఖలో భద్రతా ఏర్పాట్లపై కేంద్ర భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటి నుంచే స్థానిక అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని పాల్గోనే ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ల రేంజ్ వరకు అన్ని బిల్డింగ్ లను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఏ చిన్న డైట్ వచ్చినా.. ఒదిలి పెట్టడం లేదు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారా లేదా అనేది చూడాలి. ఇక జూన్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజు పగలు, రాత్రి సరి సమానంగా ఉంటాయి. ఈ రోజు నుంచి పగలు తక్కువగా ఉండి.. రాత్రి వేళలు అధికంగా ఉండనున్నాయి. అందుకే సైంటిఫిక్ గా ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ రోజు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ వర్ధంతి కూడా. ఓ రకంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు.. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ రోజును ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. 

Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..

Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News