)
Araku Tour package: సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు ఐఆర్సీటీసీ మరో సూపర్ టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ప్రకృతి అందాల్ని అతి తక్కువ ధరలో తిలకించే అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రా ఊటీగా పిల్చుకునే అరకు ట్రిప్ అందిస్తోంది. ఈ టూర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అరకు వ్యాలీ అందాలంటే అందరికీ ఇష్టమే. వేసవిలో రిలాక్స్ అయ్యేందుకు బెస్ట్ ప్లేస్ ఇది. ఆంధ్రా ఊటీగా పిల్చుకునే అరకు వ్యాలీలోని అందమైన లోయలు, పచ్చని కొండలు, మేఘాల మధ్యలోంచి ప్రయాణం, సొరంగాల్లో ప్రయాణం, చల్లని కాఫీ తోటలు ఇలా అన్నీ అద్భుతాలే. అందుకే అరకు అంటే అందరికీ చాలా ఇష్టమైన ప్రాంతం. ఇప్పుడు మీ కోసం ఐఆర్సీటీసీ సింగిల్ డే టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక్క రోజులోనే మీరు అరకు అందాల్ని తిలకించి రావచ్చు. విశాఖపట్నం నుంచి రైలు ప్రయాణం, ఆ తరువాత రోడ్ మార్గం ద్వారా అరకులోయ అందమైన ప్రాంతాలు చుట్టి రావచ్చు.
ఈ టూర్ ప్యాకేజ్ ప్రతిరోజూ అందుబాటులో అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయం 6.45 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. దారిలో40-50 సొరంగాలు దాటుకుంటూ ప్రయాణం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మేఘాల్లోంచి ప్రయాణించే అనుభూతి పొందుతారు. ఇలా అన్నీ దాటుకుంటూ ఉదయం 10.55 గంటకు అరకు స్టేషన్ చేరుకుంటుంది. అరకులో ట్రైబల్ మ్యూజియం, చాపరాయి వాటర్ ఫాల్స్, పద్మావతి గార్డెన్స్, కాఫీ తోటల సందర్శన ఉంటుంది. ఆ తరువాత మద్యాహ్నం భోజనం చేశాక విశాఖపట్నంకు బయలుదేరుతారు.
దారిలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ సందర్శన ఉంటుంది. సాయంత్రం 7-8 గంటలకు టూర్ విశాఖపట్నంలో ముగుస్తుంది. ఈ టూర్లో మూడు కేటగరీ ధరలు ఉన్నాయి. కంఫర్ట్ కేటగరీలో పెద్దవారికి ఒక్కొక్కరికి 3.010 రూపాయలు టికెట్ కాగా, చిన్నారులకు 2,615 రూపాయలు ఉంటుంది. ఇక స్టాండర్డ్ కేటగరీ అయితే పెద్దవారికి ఒక్కొక్కరికి 2,125 రూపాయలు, చిన్నారులకు 1730 రూపాయలు టికెట్ ఉంటుంది. సెకండ్ స్లీపర్ కేటగరీలో పెద్దవారికి 2,055 రూపాయలు, చిన్నారులకు 1655 రూపాయలు టికెట్ ఉంటుంది.
ఐఆర్సీటీసీ అందించే సింగిల్ డే అరకు టూర్ ప్యాకేజ్‌లో ట్రైన్ టికెట్లు, నాన్ ఏసీ బస్సులో రిటర్న్ జర్నీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ, బొర్రా కేవ్స్ టికెట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఈ టూర్ ఏప్రిల్ 14 నుంచి అక్టోబర్ 17 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా వెళ్లవచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి