Employees Holidays: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. నెల రోజుల పాటు సెలవులు వచ్చేశాయి. రేపటి నుంచి దాదాపు నెలకు పైగా సెలవులు వచ్చాయి. దీంతో భారీ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే సొంతూళ్లకు వెళ్లి బంధుమిత్రులతో ఎంజాయ్ చేయవచ్చు. రేపటి నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కోర్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచి జూన్ 13వ తేదీ వరకు సెలవులు ఉండనుండడం విశేషం.
Also Read: Indian Army: ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తాం.. 100 మంది ఉగ్రవాదులు హతం: భారత్ ఆర్మీ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 16వ తేదీ నుంచి పూర్తి స్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెకేషన్ కోర్టులు రెండు దశల్లో విచారణ చేపట్టనున్నారు. డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్‌గా హైకోర్టులో అత్యవసర వ్యాజ్యాలు విచారణ చేయనున్నారు.
Also Read: PoK Return: పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు! దీనిపై మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్: భారత్
వెకేషన్ కోర్టుల షెడ్యూల్
మొదటి దశ వెకేషన్ కోర్టులు
ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి.
మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్‌గా
జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్‌గా విచారణలు చేయనున్నారు
మే 29న జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్‌గా
జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్‌బెంచ్‌గా కేసులు విచారించనున్నారు
రెండో దశ వెకేషన్ కోర్టులు
జూన్ 5, 12వ తేదీల్లో విచారణ
జూన్ 5, 12 వ తేదీల్లో జస్టిస్ జస్టిస్ ఎం.కిరణ్మయి, జస్టిస్ టీసీడీ శేఖర్ డివిజన్ బెంచ్
జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్‌గా అత్యవసర వ్యాజ్యాలు విచారణ చేపడతారు
తీవ్రతను బట్టి..
హైకోర్టుకు వేసవి సెలవుల నేపథ్యంలో కేవలం అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపడతారు. తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెకేషన్ కోర్టులు విచారణ చేయనున్నాయి. పిటిషన్ వేయాలనుకున్న వారు తమ కేసు తీవ్రతను బట్టి వేయాల్సి ఉంటుంది. లేకపోతే వెకేషన్ కోర్టులు వాటిని తిరస్కరించవచ్చు. అత్యవసరమైనవి మాత్రమే వేసవి సెలవుల్లో హైకోర్టు వెకేషన్ కోర్టులు విచారణ చేయనున్నాయి. ఇది ప్రజలు గమనించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter