
Employees Promotions: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ముందంజలో ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై గందరగోళ పని చేయడంతో ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ అంశంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్టీసీలోని కండక్టర్లు, డ్రైవర్లతోపాటు మిగతా ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పదోన్నతులను నిలిపేయగా.. తాజాగా కూటమి ప్రభుత్వం వాటిని తిరిగి చేపట్టనుంది. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సూపర్వైజర్ కేడర్ వరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఆర్టీసీలో పదోన్నతులకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలపడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 3 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. పదోన్నతుల దస్త్రానికి ఆమోదం తెలపడంపై ఉద్యోగ సంఘాలు ఆనందంలో మునిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎన్ఎంయూఏ, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు చెబుతున్నారు. పదోన్నతులు సరేగానీ మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతనాల పెరుగుదల, బోనస్, ఖాళీ పోస్టుల భర్తీ వంటివి నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి