AP Nominated Posts: అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు పదవులపై ఆశతో ఎదురుచూస్తుండగా వారికి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు భారీ శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో కీలకమైన పదవులను టీడీపీ నాయకులకు ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఎవరికీ ఏ పదవి.. ఎన్ని పదవులు భర్తీ చేశారో తెలుసుకుందాం.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు
ఏపీలో గతంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయగా.. తాజాగా మరో దశ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈ పదవుల్లో మిత్రపక్షం జనసేన పార్టీకి ఒక పదవి ఇచ్చారు. రాష్ట్రంలోని జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) చైర్మన్లను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. 10 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్లను ప్రకటించారు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ చైర్మన్ గా కోన తాతారావు (జనసేన పార్టీ) నియమితులయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ పదవుల్లో కూడా జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించారు. సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యం ఇవ్వగా.. మహిళలకు మాత్రం మొండిచేయి చూపారు. ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా పదవి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Chandrababu Naidu: 'అమరావతి అందరిది... రాష్ట్రానికి ఆత్మవంటిది': సీఎం చంద్రబాబు
డీసీసీబీ చైర్మన్లు వీళ్లే..
శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ)
విశాఖ డీసీసీబీ ఛైర్మన్‍గా కోన తాతారావు (జనసేన)
విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‍గా కిమిడి నాగార్జున (టీడీపీ)
గుంటూరు డీసీసీబీ ఛైర్మన్‍గా మాకినేని మల్లికార్జునరావు (టీడీపీ)
కృష్ణా డీసీసీబీ ఛైర్మన్‍గా నెట్టెం రఘురామ్ (టీడీపీ)
నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్‍గా ధనుంజయరెడ్డి (టీడీపీ)
చిత్తూరు డీసీసీబీ ఛైర్మన్‍గా అమాస రాజశేఖర్ రెడ్డి (టీడీపీ)
అనంతపురం డీసీసీబీ ఛైర్మన్‍గా కేశవరెడ్డి (టీడీపీ)
కర్నూలు డీసీసీబీ ఛైర్మన్‍గా డి.విష్ణువర్ధన్ రెడ్డి (టీడీపీ)
కడప డీసీసీబీ ఛైర్మన్‍గా బి.సూర్యనారాయణరెడ్ది (టీడీపీ)
డీసీఎంఎస్ చైర్మన్లు వీళ్లే..
శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్‌గా అవినాష్ చౌదరి (టీడీపీ)
విశాఖపట్టణం డీసీఎంఎస్ చైర్మన్‌గా కొట్ని బాలాజీ (టీడీపీ)
విజయనగరం డీసీఎంఎస్ చైర్మన్‌గా గొంప కృష్ణ (టీడీపీ)
గుంటూరు డీసీఎంఎస్ చైర్మన్‌గా వడ్రాణం హరిబాబు (టీడీపీ)
కృష్ణా డీసీఎంఎస్ చైర్మన్‌గా బండి రామకృష్ణ (జనసేన పార్టీ)
నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్‌గా గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
చిత్తూరు డీసీఎంఎస్ చైర్మన్‌గా సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ)
అనంతపురం డీసీఎంఎస్ చైర్మన్‌గా నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
కర్నూలు డీసీఎంఎస్ చైర్మన్‌గా జి. నాగేశ్వరయాదవ్ (టీడీపీ)
కడప డీసీఎంఎస్ చైర్మన్‌గా యర్రగుండ్ల జయప్రకాశ్ (టీడీపీ)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









