Pahalgam Terror Attack: పారిపోతుంటే వెంటాడి మరీ చెంపేశారు, ఏపీ, తెలంగాణ పర్యాటకుల మృతి

Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్ పెహల్గావ్ ఉగ్రదాడిలో భయంకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. వదిలేయమని ప్రాధేయపడినా కనికరించలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతుంటే పట్టుకుని మరీ కాల్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2025, 11:07 AM IST
Pahalgam Terror Attack: పారిపోతుంటే వెంటాడి మరీ చెంపేశారు, ఏపీ, తెలంగాణ పర్యాటకుల మృతి

Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్ పహల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా మరే 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో హైదారాబాద్, విశాఖపట్నంవాసులు ప్రాణాలు కోల్పోయారు. 

Add Zee News as a Preferred Source

జమ్ము కశ్మీర్ పహెల్గావ్ ప్రాంతం పర్యాటకంగా చాలా ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కోఠీలోని ఇంటెలిజెన్స్ సబ్సిడరీ కార్యాలయంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మనీష్ రంజన్ కుటుంబంతో సహా జమ్ము కాశ్మీర్ పర్యటనకు వెళ్లాడు. అటు విశాఖపట్నంలోని పాండురంగాపురంలో నివాసముంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళితో పాటు మరో రెండు జంటలు కూడా జమ్ము కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. 

ఉగ్రదాడి జరగడానికి ముందు మనీశ్ రంజన్ ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సును ఉగ్రమూకలు చుట్టుముట్టాయి. ప్రయాణీకుల్ని కిందకు దింపి అందరి కాగితాలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల్ని విడిచి పెట్టి మనీశ్ రంజన్‌పై కాల్పులు జరిపారు. భార్య పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అటు విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి స్నేహితులతో కలిసి జమ్ము కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రదాడి జరగడంతో పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటాడి మరీ చంపేశారు. చంద్రమౌళి విజయా బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. చంద్రమౌళి కాల్పుల్లో మరణించినట్టు అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నెల 18న జమ్ము కాశ్మీర్‌కు వెళ్లిన వీళ్లంతా 26న తిరిగి రావల్సి ఉంది. 

ఉగ్రవాదుల దాడిలో ఏపీకు చెందిన మరో వ్యక్తి మధుసూదనరావు కూడా మరణించాడు. ఇతను బెంగళూరు ఇందిరా నగర్‌‌లో నివాసముంటున్నాడు. బంధువులతో కలిసి జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 

Also read: AP SSC Results 2025 Out: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఈ లింక్ https://www.bse.ap.gov.in/ క్లిక్ చేస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News