Janasena Party: నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ కు పవన్ కౌంటర్..

Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2025, 11:33 AM IST
Janasena Party: నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ కు పవన్ కౌంటర్..

Janasena Party: నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ భారత దేశానికి  అన్యాయం జరుగుతుందని  కొందరు మాట్లాడుతున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే పూర్తిస్థాయిలో చర్చిద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. ఇంకా అసలు ప్రకటన రాకముందే రాజకీయాల కోసం విషయాన్ని పెద్దగా చేయడం ఏ మాత్రం బాగాలేదన్నారు.  లబ్ధి పొందాలని చూడటం సరికాదు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుoటే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ద్రవిడ ఉద్యమాన్ని ప్రారంభించిన పెరియార్ కూడా బలిజ నేత. దేశమంతటికి బలమైన భావజాలం మనల్ని కలిపి ఉంచింది. దాన్ని గుర్తుంచుకోండి అంటూ స్టాలిన్ కు ఇచ్చిపడేసాడు. మొత్తంగా దేశం, ప్రాంతం, భాష అంటూ స్టాలిన్  దక్షిణాది అంటూ సరికొత్త వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వారు ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
   
ఈ  సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేనది మరపురాని ప్రయాణం. ఇందులో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. 2003లోనే నా తల్లిదండ్రులకు రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పాను. నన్ను చిన్నప్పటి నుంచి చాలా సున్నితంగా గారాభంగా పెంచారు. నాన్న నన్ను డిగ్రీ చేస్తే ఎస్సై అవుతావని, జీవితం సెటిల్ అవుతుందని చెప్పేవారు. కాని నేను సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగాను. 2006లో పుస్తకాలను చదవడం, సమాజాన్ని అభ్యసించడం మొదలుపెట్టాను. అప్పట్లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ శ్రీ శ్రీపతి రాముడు గారు..  బహుజన సిద్ధాంతాల గురించి చెబుతూ, మీరు రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఆయనతో తరుచూ మాట్లాడుతుంటాను. మేధావులు నాలో రాజకీయ నాయకుడ్ని చూశారు.

Add Zee News as a Preferred Source

11 యేళ్ల  జనసేన ప్రయాణంలో రాజకీయ శత్రువులను 11కి పరిమితం చేశాం. సగటు మనిషిగా ఉండటం, ఆలోచించడం నాకు ఇష్టం. నాలోని భావ తీవ్రత నన్ను పార్టీ పెట్టేలా చేసిందన్నారు. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన సోదర సమానులు, పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ కి, మొదటి నుంచి నాతోనే ప్రయాణం చేసిన  పిడుగు హరిప్రసాద్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జన సైనికులు, వీర మహిళలే నా బంధం. అనుబంధం. మీరే జనసేనానికి రక్త సంబంధం. బాధ్యతగా ముందుకు వెళ్దాం. 100 శాతం స్టైయిక్ రేటుతో పుట్టిన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుందామన్నారు.  ఇలా చేస్తే  భవిష్యత్తు మనదే అవుతుందన్నారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News