Janasena Party: తమిళ నాయకులు మీ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోండి.. స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..

Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2025, 11:01 AM IST
Janasena Party: తమిళ నాయకులు మీ సినిమాలను హిందీలో డబ్  చేయడం మానుకోండి.. స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..

Janasena Party:జనసేన జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ ఆవిర్భావ వేడుకలో దేశ విచ్ఛిన్నకర శక్తులకు ఊతమిచ్చే స్టాలిన్ లాంటి నాయకులకు  గట్టి కౌంటరే ఇచ్చారు జనసేనాని. సెక్యూలరిజం అంటే ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించడం కావాలని. ఓట్ల కోసం మాట్లాడటం కాదన్నారు. సూడో సెక్యులరిస్టులకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నా..ఎక్కడ తప్పు జరిగినా.. దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. గోద్రాలో అల్లర్లు జరిగినపుడు దాన్ని అంతా ఖండించాలి. కానీ మన దగ్గరి కొంత మంది రాజకీయకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దాని ఊసే ఎత్తరు. అలాగే కరసేవకుల రైలును తగులబెట్టినపుడు కూడా అలాగే స్పందించాలన్నారు.  ఈ దేశంలో ఓట్ల కోసం కొందరు సూడో సెక్యూలరిస్టులుగా మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లో  మంచిది కాదన్నారు. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. ఎక్కడా తప్పు జరిగినా తప్పుగానే చెబుతాం. ఎవరైనా సరే ఏ మతం వారు అయినా సరే మొదట తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్షించాల్సిందే. ఇదే కోరుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుంది. దానికోసం సెక్యూలరిజం తీసుకురావడం కరెక్టు కాదన్నారు.

Add Zee News as a Preferred Source

బహు భాషలు భారతదేశానికి మంచిది దేశంలో అన్ని భాషలను గౌరవించాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలమన్నారు. త్రిభాష సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీ డబ్ చేయడం మానుకోండి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయండన్నారు.  డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి. వారి భాషను మాత్రం మాకొద్దు అంటే ఎలా..? కడిగిపారేసారు.  భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని చెబుతారు. సంస్కృతం దేవ భాష. హిందూ ధర్మంలో ఆ భాషలోనే మంత్రాలను పఠిస్తారు. ఇస్లాం ప్రార్థనలు అరబిక్ లో ఉంటాయి. కేవలం హిందువులను మాత్రమే మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం ఎందుకు అని ప్రశ్నించారు.  భాషల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తే భారతీయుల మధ్య ఐక్యత, సమాచార మార్పిడి కూడా క్లిష్టమైపోతుంది. రూపాయి మార్కును బడ్జెట్ నుంచి తొలగిస్తే రాష్ట్రానికో పద్ధతి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది దేశానికి మంచిది కాదని స్టాలిన్ కు గట్టిగానే గడ్డి పెట్టాడు.

దేశం నుంచి విడిపోతామని ఎలా చెబుతారు..? ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. చర్చించుకోవాలి. అంతేగాని దేశం ఏమైనా కేకు ముక్కలాగ ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారేంటీ..? మీలాంటి వాళ్లు విడిపోతే నాలాంటి వాళ్లు కలపడానికి కోట్ల మంది వస్తారన్నారు.ప్రతిసారి ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడతారు. ఉత్తరాదిన కైలాసంలో శివుడు కొలువైతే, దక్షిణాదిన ఆయన బిడ్డ మురుగన్ నివాసం ఉందన్నారు. తండ్రిబిడ్డలను ఎలా వేరు చేయలేరో, దేశాన్ని అలాగే వేరు చేయలేరన్నారు. దేశం నుంచి విడగొట్టాలని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. భాష, భావం వేరు అని దేశాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు.  ఒక ఇంట్లోని కుటుంబ సభ్యుల్లోనే రకరకాల మార్పులుంటాయి. అలాంటిది ఇంత భిన్నమైన దేశంలో కొన్నిమార్పులు సహజం. రాజకీయ వైరుధ్యాలను దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మార్చకండన్నారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News