Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ చాలా విషయాలను పంచుకున్నారు. నేనే మిడిల్ క్లాస్ మెంటాలటి ఉన్న వ్యక్తిని. చాలా భయాలు, బాధ్యతలుండే సగటు మధ్య తరగతి వ్యక్తిగా పెరిగాను. ప్రజల కోసం పని చేయాలనే తలంపుతో జనసేన పార్టీని ప్రారంభించారు. ఇపుడు వంద శాతం స్ట్రయిక్ రేటు సాధించడం ప్రజల ఆశీర్వాదం, దేవుడి రాత అన్నారు. తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని చెప్పడమే నా సిద్ధాంతం అని పేర్కొన్నారు. చాలా మంది ఢిల్లీ స్థాయి జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ లెఫ్టిస్టు, రైటిస్టు, సెంట్రిస్టు అని పదేపదే రకరకాలుగా రాస్తున్నారు. నేను ఒకటే చెప్పదల్చుకున్నా. నేను చెగువేరాను ప్రేమిస్తా.. నారాయణ గురును గౌరవిస్తా. నేను లోకమాన్య బాలగంగాధక్ తిలక్ కు నమస్కరిస్తా.. జయప్రకాశ్ నారాయణ్ భావజాలం అభిమానిస్తాను.. మదర్ థెరిసాకు మొక్కుతాను...భగత్ సింగ్ ను గుండెల్లో పెట్టుకుంటాను. నేను చెగువేరాను ప్రేమిస్తా అంటే లెఫ్టిస్టు అవ్వాల్సిన అవసరం లేదు.
ఉన్నత ఆశయంతో ఆయన దేశం కాని దేశం కోసం, మనుషుల కష్టాలను అర్థం చేసుకొని పోరాడారు. అది నాకు ఇష్టం. నేను మనుషుల్లో ఉండే గొప్పదనాన్ని ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. మంచి ఎక్కుడున్నా తీసుకుంటానన్నారు. అదే నా సిద్ధాంతం. భావజాలం. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం అనే మంచిని చూడటమే నాకు తెలుసు. జనసేన ఏడు సిద్ధాంతాలను ఎంతో మదించి పార్టీ నిర్మించుకున్నాం. వాటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మార్చే వాడే అయితే ఈ దశాబ్దకాల ప్రయాణం ఎలా సాధ్యమన్నారు? ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎలా నిలబడ్డామన్నారు.
చిన్నప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీలు ఫ్రంట్.. లైన్ మగజైన్లు న్యూస్ పేపర్లు సోవియట్ భూమి పత్రికలు చరిత్ర సంస్కృతి పుస్తకాలు
సాహిత్యం ఫిలాసఫీ ఫారెన్ ఎఫైర్స్అవన్నీ సామాజిక చారిత్రక రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుక పార్టీ పెడతామన్నారు.
రాజకీయాలను చాలా బలంగా దేశం కోసం చేస్తాం. ప్రజల శ్రేయస్సు కోసం చేస్తాం. రాజకీయాలు చేయాలంటే తెల్లగడ్డం వేసుకొని పుట్టక్కర్లేదన్నారు. . ముఖ్యమంత్రి కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు. కేంద్రమంత్రి మేనమామ కావాల్సిన అవసరం లేదు. బాబాయ్ ని చంపాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను నిత్య విద్యార్థిని. జ్ఞాన సముపార్జన నిత్యం చేస్తూనే ఉంటాను. ఎన్నో థియరీలు, సిద్ధాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, సమకాలీన అంశాలను ఎన్నో పుస్తకాలను చదివే నేను సిద్ధాంతాలను రూపొందించుకున్నాను. వాటిని బలంగా నమ్ముతాను. పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎంత కష్టపడ్డానో, ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు అన్నారు. ఒకప్పుడు కరాటేలో అద్భుతంగా రాణించిన నేను.. ఇప్పుడు కనీసం నా చిన్న కొడుకును ఎత్తుకోలేని పరిస్థితిలో ఆరోగ్యం పాడయింది. రాజకీయాల్లో రెండు మార్గాలుంటాయి. ఒకటి బలంగా అధికారం కావాలనే ఆకాంక్ష అయితే, రెండోది ఆశయాలు, సిద్ధాంతాలను నమ్మి ముందుకు సాగడం ఉంటాయన్నారు. నేను రెండోది ఎంచుకున్నాను. నేను సైద్ధాంతిక రాజకీయాలను ఎంచుకున్నాను. సమాజంలో సమతుల్యత, సమభావం రావాలనే అందరిలో చైతన్యం రగిలించాలనే తపనతోనే జనసేన ముందుకు వెళ్లింది. రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్జైజ్డ్ పార్టీగా ఎదిగింది.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









