Nagababu: పిఠాపురం వర్మకు నాగబాబు కౌంటర్..! టీడీపీలో దుమారం..

Nagababu: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ముఖ్యంగా భాష, ప్రాంతం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసే నాయకులుకు ఇచ్చిపడేసారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2025, 09:01 AM IST
 Nagababu: పిఠాపురం వర్మకు నాగబాబు కౌంటర్..! టీడీపీలో దుమారం..

Nagababu:జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు  దుమారం రేపుతున్నాయి. 4 దశాబ్దాల తెలుగు దేశం పార్టీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించడాన్ని.. టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శిస్తున్నారు.  

Add Zee News as a Preferred Source

అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే అధికారంలోకి వచ్చామని జన సైనికులు అంటున్నారు. మరోవైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఎవరైనా తామే గెలిపించామనుకుంటే అది వారి ఖర్మ అన్నారు నాగబాబు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో రెండు నిజాలు ఉన్నాయన్నారు. ఒకటి పవన్ కల్యాణ్ అయితే రెండోది పిఠాపురం జనసైనికులు, ఓటర్లు అని వ్యాఖ్యానించారు. ఇందులో పిఠాపురం వర్మ పాత్ర లేదని తేల్చి పాడేసారు. మొత్తంగా ఈ సభలో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు పెట్టేలా ఉన్నాయన్నారు.

ఈ సభలో పవన్ కళ్యాణ్ పలు అంశాలపై సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చారు. సనతానం, హిందూ ధర్మం, భాష సహా పలు అంశాలపై అనర్గలంగా మాట్లాడారు. నాగబాబు విషయానికొస్తే..ఎమ్మెల్యే  కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ క్యాబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News