Janasena Party: నా రక్తంలోనే హిందుత్వం ఉంది.. జయకేతనం సభలో పవన్ ఆవేశ పూరిత ప్రసంగం..

Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. సూడో సెక్యులరిస్ట్ రాజకీయ నాయకుల గుండెల్లో రైల్లను పరిగెత్తెలా చేసాడు. ముఖ్యంగా ఈ సభ వేదికగా హిందుత్వం సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2025, 08:37 AM IST
Janasena Party: నా రక్తంలోనే హిందుత్వం ఉంది.. జయకేతనం సభలో పవన్ ఆవేశ పూరిత ప్రసంగం..

Janasena Party: పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. ఈ సభ వేదికగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చాలామంది అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ హిందు ధర్మ పరిరక్షకుడు అయిపోయాడు. సనాతనవాది అయిపోయాడు అని మాట్లాడుతున్నారు. వారికి చెప్పేదొక్కటే. నా రక్తంలోనే హిందుత్వం ఉంది. నేను 21 సంవత్సరాల వయసు నుంచి దీక్షలు చేస్తూ వచ్చాను. మొదటి నుంచి సనాతన ధర్మం పాటిస్తున్నవాడినేన్నారు. నాకు  సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరి దగ్గరా ప్రూఫ్ చేసుకోవాల్సిన అగత్యం లేదన్నారు. నాకు హిందుత్వం, సనాతన ధర్మం అనేది ఓట్ల కోసం అయితే 219 ఆలయాల మీద దాడి జరిగినపుడు నేను ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలి కదా..? కాని నేను సంమయమనం పాటించాను.

Add Zee News as a Preferred Source

నిత్యం శ్రీరాముడిని కొలిచే మాకు రాముడు విగ్రహం తల నరికితే కోపం రాకూడదు అని చెప్పడానికి మీరెవరన్నరు..? హైదరాబాద్ లో ఓ నాయకుడు మాకు 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ అంతం చేస్తామని చెబితే మేం మాట్లాడకూడదని చెబుతారేంటీ..? బతుకమ్మను హేళన చేస్తూ మాట్లాడితే మౌనంగా ఉండమని చెబుతారేంటీ.. అన్నారు.  మేం పూజించే పార్వతీదేవి, లక్ష్మి దేవిలను తిడతారు. అయినా ఏం అనకూడదు అంటే ఎలా అన్నారు.  ఆ జనరేషన్ వెళ్లిపోయింది. ఇప్పుడు మేం తప్పును తప్పు అనే చెబుతాం. అల్లాకు, జీసస్ కు ఓ న్యాయం అమ్మవారికి ఓ న్యాయం అంటే కుదరదన్నారు.

సనాతన ధర్మం పాటించిన విజయనగర రాజులు మసీదు నిర్మించారు. బంగ్లాదేశ్ ఏర్పాటుకు సనాతన ధర్మం పాటించే ఆలోచనే మూలం అన్నారు. పాకిస్థాన్ మొదటి లా మినిస్టర్ శ్రీ జోగింద్రనాథ్ మండల్ గారు పాకిస్థాన్ వెళ్లిన తర్వాత అక్కడ ఆయన కుటుంబం ఊచకోతకు గురైతే మళ్లీ భారతదేశానికి కాందిశీకుడిగా వచ్చి చనిపోయారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో 10 నుంచి 12 శాతం మేర హిందువులు ఉంటే ఇప్పుడు అక్కడ 1 నుంచి 2 శాతానికి తగ్గిపోయారు. బంగ్లాదేశ్ లో నిత్యం హిందువులు నరకయాతన అనుభవిస్తున్నారు. కాని భారతదేశంలో ముస్లింలను, క్రైస్తవులను ఎంతో గౌరవిస్తున్నామన్నారు. వారికి సమాజంలో సొంతవారిగా చూసుకుంటాం. ఇది సనాతన ధర్మం చూపించిన గొప్ప దారి ఇది. అంతా బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకోవడమే సనాతన ధర్మ లక్ష్యమన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగినపుడు కూడా నేను దోషులను పట్టుకోవాలని అన్నాను తప్ప ఇస్లాం, క్రైస్తవం గురించి మాట్లాడలేదన్నారు. ఆఖరికి కల్తీ చేసిన వారు కూడా హిందువులనే తేలింది. తప్పు జరిగినపుడు తప్పు జరిగిందని నిర్భయంగా చెబుతాము. మా మనోభావాలు గాయపడినపుడు బయటకు వచ్చి మాట్లాడతాము. అందులో తప్పేముందన్నారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News