గుత్తి: అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుత్తిలో గురువారం పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అభ్యర్థిగా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీచేస్తోన్న మధుసూదన్ గుప్తా గుత్తిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అభ్యర్థుల జాబితాలో తన ఫోటో లేకుండా కేవలం పేరు మాత్రమే ఉండటాన్ని తప్పుపడుతూ ఆయన పోలింగ్ సిబ్బందితో వాగ్వీవాదానికి దిగడమే ఈ ఉద్రిక్తతలకు దారితీసింది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''ఈ ఎన్నికలు పూర్తి బోగస్ ఎన్నికలని, ఈవీఎంల నిర్వహణ కూడా బోగసే అంటూ సిబ్బందిని నిలదీసే క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన మధుసూదన్ గుప్తా అక్కడే టేబుల్‌పై ఉన్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)ను ధ్వంసం చేస్తున్నాను అని చెప్పి మరి నేలకేసికొట్టారు. దీంతో పోలింగ్ విధులకు ఆటంకం కలిగించి ఈవీఎంను ధ్వంసం చేశారంటూ అక్కడే పోలీసులు మధుసూదన్ గుప్తాను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.