AP Government: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏపీలో ఏర్పాటు కానుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ పరిశ్రమ ఎయిర్ కండీషనింగ్, స్పేర్‌పార్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ(Electronic Products Unit)కేంద్రం రానుంది. జపాన్‌కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  రాష్ట్రంలో ఎయిర్ కండిషనింగ్, విడి భాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది.


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శ్రీసిటీలో 75 ఎకరాల విస్తీర్ణంలో వేయి కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. శ్రీసిటీ నిర్వాహకులకు డైకిన్ ఇండియాకు మధ్య భూమి కొనుగోలుకు సంబంధించి ఒప్పందమైంది. ఈ పరిశ్రమ ద్వారా 3 వేలమందికి ఉపాధి లభించనుంది. 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనేది లక్ష్యంగా ఉంది. దిగుమతుల్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 13 రంగాలకు ఆత్మ నిర్భర్ పథకాన్ని(Aatma Nirbhar Bharat)ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన తొలి కంపెనీ డైకిన్. మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికీ 5-6 శాతం మాత్రమే ఏసీ వినియోగం జరుగుతోంది దేశంలో. ఈ క్రమంలో మార్కెట్ విస్తరించేందుకు చాలా అవకాశాలున్నాయి. తక్కువ వ్యయంతో అత్యుత్తమ ఉత్పత్తుల కోసం ప్రయత్నిస్తున్నామని డైకిన్ ప్రతినిధులు తెలిపారు. అమెరికా, మధ్య ఆసియా దేశాల ఎగుమతుకు ఏపీ కీలకంగా ఉండటంతో ఆఫ్ షోర్ డెలివరీ హబ్‌గా తీర్దిదిద్దనున్నారు. 


డైకిన్ ఇండియాకు (Daikin India)ఇప్పటికే దేశంలో రెండు యూనిట్లు ఉన్నాయి. దక్షిణాదిలో ఇదే తొలి యూనిట్ కావడం విశేషం. ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ రంగంలో ప్రపంచ ఖ్యాతి పొందిన జపాన్ సంస్థ డైకిన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపారానికి కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అనువైన వాతావరణంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. 


Also read: Ports Privatization: దేశంలో పోర్టుల ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్టేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి