Kommineni Srinivasarao Arrest: ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావును హైదరాబాద్‌లో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ న్యూస్ ఛానెల్‌లో కొమ్మినేని డిబేట్ సందర్భంగా అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు అసభ్యకరంగా మాట్లాడారు. ఈ కామెంట్స్‌పై అన్ని వైపులా నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి.. ఏపీకి తీసుకువస్తున్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదైంది.
జర్నలిస్ట్ కృష్ణం రాజు, కొమ్మినేనిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్లతో పాటు SC, ST చట్టంలోని వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటికెళ్లిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని చెప్పారు. మరో జర్నలిస్ట్ కృష్ణం రాజును అరెస్ట్ చేసేందుకు విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణం రాజు అసభ్య వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఆపకుండా చర్చ కొనసాగించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొమ్మినేనిను తుళ్లూరు పోలీస్ స్టేషన్ నమోదైన కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా కొమ్మినేని మాట్లాడారని ఫిర్యాదులో రాజధాని మహిళలు పేర్కొన్నారు. జర్నలిస్ట్ కృష్ణం రాజు విజయవాడ, తుళ్లూరు నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం సాయంత్రంలోగా కృష్ణం రాజును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నా.. క్షమాపణ చెప్పని ఇద్దరు జర్నలిస్టులపై మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో A1 గా కృష్ణం రాజు, A2 గా కొమ్మినేని, A3 గా సాక్షి ఛానల్ యాజమాన్యం పేర్లను పోలీసులు చేర్చారు.
తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటని.. సెర్చ్ వారెంట్ లేకుండా ఎందుకు వచ్చారని పోలీసులను కొమ్మినేని ప్రశ్నించారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పలేకపోయారని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైందని.. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసి తీసుకువెళుతున్నామని పోలీసులు చెప్పారు.
Also Read: Tirumala Video: తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడుపని.. కొంచెమైన బుద్ధుండక్కర్లేదా...?.. వీడియో వైరల్..
Also Read: Naxals Blast: పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మవోలు.. ఏఎస్పీ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









