)
Jurala Project in Danger: కృష్ణా పరివాహాక ప్రాజెక్టుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సీజన్ లో జూలై రాకముందే పలు ప్రాజెక్టులు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే ఈ సీజన్ లో ఇప్పటికే పలుమార్లు జూరాల గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు...దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే మరోసారి భారీగా వరద పెరగడంతో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిపోయింది.
ఈ రోజు ఉదయం గేట్లను ఎత్తే టైంలో డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయినట్లు తెలుస్తుంది. అలాగే 12, 16 గేట్లు కూడా చాలా బలహీనంగా ఉన్నట్టు ఇరిగేషన్ ఇంజినీర్లు తేల్చిచెప్పారు. అయితే గేట్ రోప్ తెగిపోయిందని స్థానిక ప్రజలకు సమాచారం అందడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోన్న భయాందోళనలో స్థానికులు ఉన్నారు.
మరోవైపు ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ పై భాగాన ఉన్న తుంగభద్ర, ఆల్మట్టి డ్యామ్స్ నిండిపోయాయి. పూర్తి స్థాయిలో వాన కాలం రాకముందే ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతుంది. ఇప్పటికే జూరాలకు సంబంధించిన గేట్లను గత నెల నుంచి పలుమార్లు ఎత్తారు. పలుమార్లు గేట్లు ఎత్తడం వల్ల దానిపై ఒత్తడితో పాటు ఇప్పటికే రిపేర్లు చేసి చాలా కాలం అయినందున జూరాల ప్రాజెక్ట్ 9వ రోప్ కొంచెం వీక్ అయింది. అటు 12, 16 గేట్లు కూడా వీక్ ఉన్నట్టు ఇంజినీర్లు తేల్చారు. తక్షణం మరమ్మత్తులు చేయకపోతే ప్రాజెక్ట్ మనగడకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.