KA Paul: 'నా ఆస్తులు కొట్టేయాలని కుట్ర'.. చంద్రబాబు, పవన్‌పై కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు

KA Paul Sensational Allegations On Chandrababu And Pawan Kalyan: తన ఆస్తులపై పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు కన్నేశారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయంపై పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2025, 03:28 PM IST
KA Paul: 'నా ఆస్తులు కొట్టేయాలని కుట్ర'.. చంద్రబాబు, పవన్‌పై కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు

KA Paul Assets: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆస్తులు కొట్టేయడానికి కూటమి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 'నా చారిటీ ఆస్తులు కొట్టేయడానికి కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో చర్చిలకు అనుమతులు ఉన్నాయా లేదా? అనే సమాచారం సేకరించాలని   పవన్ కల్యాణ్ ఓఎస్‌డీ ఒక నోటీస్ ఇచ్చి మళ్లీ వెంటనే ఆ నోటీసును ఉపసంహరించుకున్నారు' అని తెలిపారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: Bumper Bonanza: ఐపీఎల్‌ బంపర్‌ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం

విశాఖపట్టణంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా పాల్‌ విమర్శలు.. ఆరోపణలు చేశారు. 'పవన్ చర్చిలోకి ఎందుకు వెళ్లావు. భగవద్గీత పట్టుకోకుండా బైబిల్ ఎందుకు పట్టుకున్నావ్?' అంటూ కేఏ పాల్‌ ప్రశ్నించారు. 'పవన్ కల్యాణ్ సనాతనవాది కాదు సెక్యులర్. సనాతన ధర్మంలో మూడో పెళ్లి చేసుకోకూడదు. నా ఆస్తులు కాజేయాలని చూస్తున్నారు' అని ఆరోపించారు. జీవీఎంసీ ద్వారా తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు.

Also Read: Red Cells: శరీరంలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటీ? అవి పెరగాలంటే ఏం తినాలి?

'కావాలనే నాకు పన్నులు అధికంగా విధిస్తున్నారు. నేను అన్ని రకాలుగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. పవన్ ప్రసంగం అంతా విన్నా. గతంలో ఆయన మాటలకు ఆయనే వ్యతిరేకంగా మాట్లాడాడు. నొప్పి లేకుండా పుట్టానని పవన్ చెప్పడం దుర్మార్గం' అని కేఏ పాల్‌ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మాతృ భాషను అమ్మేశాడు.. ఒకప్పుడు హిందీ మాకు ఎందుకు అన్న పవన్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అని గుర్తుచేశారు.

'ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని నేనే గెలిపించానని పవన్ అనడం దారుణం. పవన్ కల్యాణ్ నాశనానికి సమయం దగ్గర పడింది అనిపించింది' అని పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ విమర్శలు చేశారు. 'పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్మను పవన్‌ తీవ్రంగా అవమానించారు. ప్రపంచంలో మెగా కుటుంబం అంత అవినీతి కుటుంబం లేదు' అని ఆరోపించారు. వైఎస్‌ జగన్ తనతో కలిస్తే వారంలో రెడ్ బుక్‌ని మూసివేస్తానని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News