)
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు దేశ వ్యాప్తంగా కూడా ప్రముఖ శివాలయాలతో పాటు వైష్ణవ ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇక తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొలువైన కాళేశ్వరముక్తేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీకపౌర్ణమి సందడి నెలకొంది. భక్తులు త్రివేణి సంగమం, గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేకంగా అభిషేకాలు,పూజలు చేస్తున్నారు. శుభానందాదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయంలో కుంకుమార్చన పూజలు చేస్తున్నారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేసి ముగ్గులువేసి 365 ఒత్తులతో దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది.
అటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో రాత్రి తెల్లవారుఝాము నుంచే భక్తుల సందడి నెలకొంది. ముఖ్యంగా పాతాళ గంగకు భక్తులు పోటెత్తి అక్కడ పుణ్య స్నానాలు ఆచరించి అరటి దొన్నెల్లో దీపాలను వెలిగించి నదిలో ఒదిలారు. అటు శ్రీశైలను మల్లన్నతో పాటు భ్రమరాంబికి దేవిని దర్శించుకున్నారు. అటు కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో సందడి నెలకున్నాయి. తెల్లవారు జామునే స్వామిని అభిషేకించి, ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించారు. శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్దలతో 365వత్తులతో కార్తీక దీపాలు వెలిగించి శివ పూజలో పాల్గొన్నారు. శవనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. కార్తీక పౌర్ణమి నాడు పూజలు, దీపారాధన చేస్తే శివుని అనుగ్రహం పొందుతారని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలతో పాటు ఉపవాసాలు ఉండటం వలన ఆయు: ఆరోగ్యాలు బాగుంటాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఉపవాసము ఉంటే కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా శివుని దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం ముందు భాగంలో కార్తీకదీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనుబంధ ఆలయమైన భీమన్న ఆలయంలో సైతం భక్తుల రద్దీ కొనసాగుతుంది.
అటు డిప్కీ పున్నం మహా పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. మరోవైపు గోదావరి నది తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల కార్తిక స్నానాలతో పులకరిస్తోంది. రాజమండ్రి పుష్కర ఘాట్ లో వేలాదిగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు శివనామ స్మరణతో స్నానఘట్టాలు మారుమోగుతున్నాయి.. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి మహిళలు కార్తిక దీపాలు వదులుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. కార్తీక మాసంలో గోదావరిలో కార్తీక దీపాలు వెలిగించడం వలన పాపం పరిహారం లభిస్తుందని భక్తుల విశ్వాసం.అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలతో పాటు అన్ని బస్తీల్లో ఉండే స్థానిక ఆలయాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో 365 ఒత్తుల దీపాలను వెలగించి తరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook