పరిపూర్ణానందకు కత్తి మహేష్ అనూహ్య మద్దతు !

                                            

Updated: Jul 11, 2018, 05:01 PM IST
పరిపూర్ణానందకు కత్తి మహేష్ అనూహ్య మద్దతు !

హైదరాబాద్ నగర బహిష్కరణ విషయంలో  పరిపూర్ణానందకు సినీ క్రిటిక్ కత్తి మహేస్ మద్దతు పలికాడు. ఈ సందర్భంలో ఆయన పరాపూర్ణనంద నగర బహిష్కరణను తీవ్రంగా ఖండించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. బహిష్కరణలతో సమస్యకు పరిష్కారం కాదు.. వాస్తవానికి బహిష్కరణలు ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. 'మనుషుల్ని తప్పిస్తే సమస్యలు తప్పుతాయి' అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుందని కత్తి  వ్యాఖ్యానించాడు.

ఇటీవలే కత్తిమహేష్ కూడా నగర బహిష్కరణకు గురైన విషయం తెలిందే. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బదీసేలా వ్యవహరించాడని ఆరోపిస్తూ ఆయన్ను 6 నెలల పాటు నగర బహిస్కరణ చేస్తూ హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే పరిపూర్ణానంద స్వామిని కూడా బహిష్కరించడం...ఈ విషయంలో పురిపూర్ణానంద స్వామికి కత్తి మహేష్ మద్దతు తెలపడం గమనార్హం.

Tags: