Andhra Pradesh Kidney Rocket: అక్రమంగా ఓ మహిళ నుంచి కిడ్నీలు తీస్తున్నప్పుడు, ఆమె ప్రమాదవ శాత్తూ మృతి చెందడంతో వ్యవహారం బయటపడింది. విశాఖ పట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు రూ.8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ నేపథ్యంలో మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ నెల 9న శస్త్రచికిత్స చేస్తుండగా మూర్చ రావడంతో యమున మృతి చెందింది. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉన్న ఆమె భర్త సూరిబాబుకు చెప్పడంతో ఆయన బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అయితే అప్పటికే మదనపల్లె నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో రహస్య ప్రాంతానికి తరలించారు. మరోవైపు, తిరుపతి చేరుకున్న సూరిబాబును మధ్యవర్తులైన సత్య, పద్మ కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. సూరిబాబు తిరుపతి నుంచే 112కు ఫిర్యాదు చేశారు.
తిరుపతి తూర్పు పోలీసులు అక్కడకు వచ్చి ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. తర్వాత వారిని మదనపల్లెకు తీసుకెళ్లి అక్కడి 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారించిన స్థానిక పోలీసులు మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లు తేల్చారు. ఆ ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన యమున మృతదేహం ఎక్కడ ఉందన్న విషయం బయటకు తెలియడం లేదు.
Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!
Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








