Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ముంబైకి తరలింపు

Kodali Nani Shifted To Mumbai Here Health Update: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. దీంతో హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన ముంబైకి తరలించారు. అక్కడ గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2025, 02:16 PM IST
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ముంబైకి తరలింపు

Kodali Nani Health Update: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నాయకుడు కొడాలి నాని ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు సమాచారం. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడిని హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి ముంబైకి తరలించారు. వైద్య నిపుణులతో శస్త్ర చికిత్స కోసం ముంబై తరలించినట్లు సమాచారం. అతడు ఇంకా కోలుకోలేదని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కొడాలి నాని కుటుంబసభ్యులు, బంధుమిత్రులతోపాటు వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. మద్యం తాగి బుల్లెట్ నడిపాడా?

కొడాలి నానికి గుండెకు సంబంధించిన మూడు వాల్స్ క్లోజ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఛాతీ నొప్పితో వారం కిందట హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వారం నుంచి చికిత్స పొందుతున్న కొడాలి నాని ఆరోగ్యం ఆందోళనగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తూనే అతడి గుండెకు సంబంధించి మూడు వాల్స్‌ మూసుకుపోయాయని పరీక్షల్లో తేలింది. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు కుటుంబసభ్యులకు సూచించినట్లు సమాచారం.

Also Read: TDP Foundation Day: ఆవిర్భావ దినోత్సవం రోజు చంద్రబాబు సంచలన ప్రకటన.. జగన్‌కు భారీ షాక్‌

ఈ సందర్భంగా శస్త్ర చికిత్స కోసం ముంబై వెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్‌ కాగా అటు నుంచి వెంటనే ముంబైకి తరలించారు. శస్త్ర చికిత్స కోసం ముంబైకి మాజీ మంత్రి కొడాలి నాని తరలించినట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి ముంబైకు ప్రత్యేక విమానంలో బయల్దేరారు. నానిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారని నాని సన్నిహితులు చెబుతున్నారు. అక్కడ నానికి స్టంట్‌ లేదా బైపాస్‌ సర్జరీ చేసే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు తదుపరి చికిత్స అందించనున్నారు.

జగన్‌ ఆదేశాలతోనే..
ప్రస్తుతానికి కొడాలి నాని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కాగా కొడాలి నాని ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. జగన్‌ ఆదేశాలతోనే ముంబైకి తరలించినట్లు.. ప్రత్యేక విమానం జగన్‌ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబసభ్యులతో వైఎస్సార్ సీపీ నాయకులు టచ్ లోనే ఉన్నట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News