Kodali Nani Health Update: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడిందని సమాచారం. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడికి విజయవంతంగా సర్జరీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నాని కోలుకుంటున్నారని వైద్యులు చెప్పినట్లు నాని కుటుంబసభ్యులు తెలిపారు. నాని సర్జరీ విజయవంతం కావడంతో నాని కుటుంబసభ్యులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: YS Jagan: కళ్లు మూసుకుంటే మూడేళ్ల తర్వాత వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో విజయం పక్కా
ఛాతీ నొప్పితో వారం కిందట హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో నాని చేరిన విషయం తెలిసిందే. వారం నుంచి చికిత్స పొందుతున్న కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడలేదు. చికిత్స అందిస్తూనే అతడి గుండెకు సంబంధించి మూడు వాల్స్ మూసుకుపోయాయని పరీక్షల్లో తేలింది. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో నానిని హుటాహుటిన హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు. వైద్య నిపుణులతో శస్త్ర చికిత్స కోసం ముంబై తరలించారు.
Also Read: TTD Decisions: తిరుమలను ప్రక్షాళన చేయాల్సిందే! టీటీడీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ముంబైలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో కొడాలి నానికి బుధవారం విజయవంతంగా సర్జరీ పూర్తి చేసినట్లు సమాచారం. 10 గంటలపాటు ప్రముఖ కార్డియాక్ సాధ్యం డాక్టర్ పాండ వైద్య బృందం శస్త్ర చికిత్స చేశారు. సర్జరీ అనంతరం కోలుకున్న నాని కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సర్జరీ అనంతరం నాని విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మరో మూడు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో నాని ఉండాల్సి వస్తోంది. మరోసారి పరీక్షలు.. నాని కోలుకునే స్థితిని బట్టి డిశ్చార్జ్ చేయడమో.. తదుపరి వైద్యం చేయాలా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆందోళన చెందుతున్న నాని కుటుంబసభ్యులు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. సర్జరీ విజయవంతమవడమే కాకుండా కోలుకుని కొడాలి నాని మాట్లాడుతుండడంతో గుడివాడ ప్రజలు, వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలతోనే ముంబైలో నానికి వైద్యం అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









