Kodali Nani: ముంబై హాస్పిటల్ లో వైసీసీ నేత కొడాలి నానికి కొనసాగుతున్న చికిత్స..

Kodali Nani Treatment: మాజీ మంత్రి, YCRCP నేత మాజీ మంత్రి  కొడాలి నాని  ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  కోలుకుంటున్నారు.  కొడాలి నాని కొన్ని రోజుల పాటు ఐసీయూలో డాక్లర్ట పర్యవేక్షణలో ఉండనున్నారు.  ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని డాక్టర్లు ధ్రువీకరించారని సమాచారం. మరో నెల రోజుల పాటు నాని ముంబైలోనే ఉంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 4, 2025, 10:52 AM IST
Kodali Nani: ముంబై హాస్పిటల్ లో వైసీసీ నేత కొడాలి నానికి కొనసాగుతున్న చికిత్స..

Kodali Nani Treatment: మాజీ మంత్రి కొడాలి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.  ఈ సందర్భంగా ఈయనకు ఈ నెల 2న నిర్వహించిన బైపాస్‌ సర్జరీ విజయవంతమైనట్లు సమాచారం.సుమారు 8 నుంచి 10 గంటల పాటు ఏషియన్‌ హార్ట్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రి చీఫ్‌ సర్జన్‌ రమాకాంత్‌ పాండా ఈ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది.  మరోవైపు కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని గుడివాడలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఇతర మతస్తులు కూడా ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

మాజీ మంత్రి కొడాలి నాని గత నెలలో అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గ్రాస్టిక్ సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని గుర్తించారు. మూడు రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు ఏఐజీ డాక్టర్లు గుర్తించారు.. నానికి రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం సర్జరీ చేయకూడదని నిర్ణయించారు.

కానీ ఉన్నట్టుండి గత నెల 31న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ముంబైకు ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అక్కడ ఏషియన్‌ హార్ట్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రిలో చేర్చగా.. ఈ నెల 2న నిర్వహించిన సర్జరీ విజయవంతం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆయన కోలుకోగానే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు. అయితే.. ఏపీ, తెలంగాణలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా టీడీపీ, జనసేనకు సంబంధించనవే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటే..కూటమి ప్రభుత్వ నేతలు తనను ఏదైనా చేస్తారనే ఉద్దేశ్యంతో ఇక్కడి హాస్పిటల్స్ పై నమ్మకం లేకనే ఆయన ముంబైలో చికిత్స కోసం వెళ్లినట్టు ఇన్ సైడ్ టాక్.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News