కోడెల కేసును ప్రస్తావిస్తూ సీఎం జగన్‌ను టార్గెట్ చేసిన చంద్రబాబు

కోడెల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Last Updated : Sep 17, 2019, 11:49 PM IST
కోడెల కేసును ప్రస్తావిస్తూ సీఎం జగన్‌ను టార్గెట్ చేసిన చంద్రబాబు

అసెంబ్లీ కార్యాలయానికి సంబంధించిన ఫర్నీచర్ వాడుకున్నారనే ఆరోపిస్తూ కోడెల మీద నమోదైన కేసుపై చంద్రబాబు స్పందించారు . వాస్తవానికి సభాపతి హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన ఇల్లు, క్యాంప్ కార్యాలయానికి చెందిన ఫర్నీచర్ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. కేవలం లక్ష రూపాయలు విలువచేసే ఫర్నీచర్ వాడుకున్నందుకు కోడెలపై ఎన్నో అభియోగాలు మోపారు.. మరి సీబీఐ నిర్ధారించినట్లు ..వైఎస్ జగన్ రూ.43 వేల కోట్లు దోచుకున్నారు కదా.. మరి ఆయనపై ఎన్ని అభియోగాలు మోపాలని చంద్రబాబు ప్రశ్నించారు.

వైసీపీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్ని చంద్రబాబు దయ్యబట్టారు. కోడెలను వెంటాడి వేధించారని..అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన్ను ఉద్దేశపూర్వకంగా ముప్పుతిప్పలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ చేసిన టార్చర్ భరించలేక పల్నాటి పులిగా పెరున్న కోడెలకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెలపై నమోదు చేసిన కేసులతో  సహా టీడీపీ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు.  

Trending News