Kurnool Bus Travels: కర్నూల్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ బస్సు అగ్ని ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలకు సంబంధించి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. బస్సు అగ్ని ప్రమాదం జరగక ముందు శివశంకర్ డెడ్ బాడీతో ఎర్రిస్వామి రోడ్డు పక్కన నిల్చుని కనిపించాడు.
అదే సమయంలో ప్రమాదానికి గురైన బైక్ రోడ్డుపై పడి ఉంది. ఈ క్రమంలో వి.కావేరి ట్రావెల్స్ బస్సు కంటే ముందు మూడు బస్సులు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను తప్పించుకుని పక్కనుంచి వెళ్లాయి. కానీ కావేరి బస్సు మాత్రం ఆ బైక్‌ను లాక్కుంటూ వెళ్లిపోయింది.
ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అందుకు సంబంధించిన విజువల్స్ వి.కావేరి బస్సు కంటే ముందు వెళ్లిన బస్సు డాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు అవి బయటకు రావడంతో సంచలనంగా మారాయి. మరి ఈ కేసులో బస్సు డ్రైవర్ ను ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ప్రమాద ఘటన తర్వాత ఆర్టీఏ అధికారులు మొద్దు నిద్ర లేచారు. మరోవైపు ఈ ఘటన తర్వాత తెలంగాణ, ఏపీ బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!
Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









