Video Viral: ఇదెక్కడి భక్తిరా నాయన.. దేవుడి హుండీలో కర్పూరం వెలిగించి వేసిన మహిళ.. వీడియో..

Lady devotee burns hundi with camphor in pithapuram: ఏపీకి చెందిన పిఠాపురంలో మహిళ భక్తురాలు భక్తి పారవశ్యంలో కర్పూరంను వెలిగించి దేవుడి హుండీ వేసింది. దీంతో పొగలు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఈ వీడియో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 9, 2025, 04:50 PM IST
  • హుండీలో కర్పూరం వేసిన భక్తురాలు..
  • పిఠాపురంలో ఘటన..
 Video Viral: ఇదెక్కడి భక్తిరా నాయన.. దేవుడి హుండీలో కర్పూరం వెలిగించి వేసిన మహిళ.. వీడియో..

Lady devotee burns gods hundi notes with camphor in Pithapuram: ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తొంది.  వచ్చే అమావాస్య వరకు కూడా చాలా మంది భక్తులు కార్తీక మాసం నేపథ్యంలో శివ, వైష్ణవ ఆలయాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.  ఈ నేపథ్యంలో చాలా మంది దీపాలు వెలిగిస్తారు. అగరవత్తులు వెలిగిస్తారు. దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంటారు. ఇదంతా మనం చూస్తునే ఉంటాం.

Add Zee News as a Preferred Source

 

కానీ ఇక్కడ ఒక అపర భక్తురాలు చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు. ఈ ఘఠన ఏపీలోని పిఠాపురంలో చోటు చేసుకుంది. పిఠాపురంలోని శ్రీదత్త స్వామి ఆలయంకు వచ్చిన ఒక భక్తురాలు స్వామికి కర్పూరం వెలిగించి ఆరతి ఇచ్చింది. మరీ ఆమెకు ఏమన్పించిందో ఏంటో కానీ.. ఆ వెలిగించిన కర్పూరం కాస్త హుండీలో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కాసేపటికి హుండీ లో నుంచి పొగలు వస్తుండటంతో అక్కడి సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే హుండీలో నీళ్లు పోశారు. ఆ తర్వాత హుండీని తెరిచారు. అప్పటికే అనేక నోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.  వెంటనే అక్కడి సిబ్బందితో లెక్కింపు చేయించారు.

Read more: Pawan Kalyan Video: చిత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటన.. సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు.. వీడియో వైరల్..

ఆ తర్వాత నోట్లను బైటకు తీసి హెయిర్ డ్రాయర్ తో ఆరబెట్టారు. ఈ ఘటన తెలిసి అందరు అవాక్కయ్యారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి భక్తిరా బాబు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News