Madhumathi Suicide: లేడీ యూట్యూబర్ ఆత్మహత్య... పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.?... వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Youtuber madhumathi suicide in ntr district: ఏపీలో ఫెమస్ లేడీ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకొవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ప్రస్తుతం షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : May 2, 2025, 12:53 PM IST
  • లేడీ ట్యూబర్ ఆత్మహత్య..
  • ఎఫైర్ కారణమంంటూ ప్రచారం..
Madhumathi Suicide: లేడీ యూట్యూబర్ ఆత్మహత్య... పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.?... వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Lady youtuber madhumathi commits suicide: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో లేడీ యూట్యూబర్ మధుమతి ఆత్మహత్య ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. తాజాగా మధుమతి.. తన అ‍మ్మమ్మ ఇంటికి వెళ్లింది. అయితే.. అక్కడ అనూహ్యంగా గదిలో ఉన్న ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలంగా మారింది. యువతి డోర్ వేసుకుని ఉండి ఎంత సేపైన తీయక పొవడంతో ఇంట్లో వాళ్లు కిటికి నుంచి చూశారు.

Add Zee News as a Preferred Source

 

అప్పుడు యువతి ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే డోర్ పగలకొట్టిలోపలికి వెళ్లి చూడగా అప్పటికే యువతి విగత జీవిగా ఉండటంను ఇంట్లో వాళ్లు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండలం కొండూరుకు చెందిన మధుమతి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా రీల్స్ చేస్తు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మధుమిత సోషల్ మీడియా అకౌంట్ లకు.. లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఇదిలా ఉండగా.. మధుమతికి ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచుగా మాట్లాడుకునే వారు.  అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు సమాచారం.ఈ క్రమంలోనే యువతి ఒక్కసారిగా సూసైడ్ చేసుకొవడం పెద్ద షాకింగ్ గా మారింది. ఈ క్రమంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతి డెడ్ బాడీని మార్చూరీకి తరలించారు. అంతే కాకుండా..యువతి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Read more: Kedarnath Temple Opens: తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం తలుపులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న హిమ శిఖరాలు..

అయితే.. తమ కూతురు సూసైడ్ కు.. తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బోల్లిపోగు ప్రతాప్ కారణమని.. యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్ వేధింపుల వల్ల తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మధుమతి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News