Tirumala halchal in alipiri footpath: తిరుమలలో కొన్నిరోజులుగా క్రూర జంతువుల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ముఖ్యంగా మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు తరచుగా చిరుతపులులు, ఎలుగు బంట్ల, పాముల సంచారంలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులు ఇటీవల గుంపులుగా వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.
గతంలో కర్రలను పట్టుకుని కూడా వెళ్లాలని భక్తులకు అధికారులు సూచించారు. అంతే కాకుండా.. తిరుమలలో పరిధిలో ఇటీవల చిరుత పులులు, ఎలుగు బంట్లు మెట్లమార్గంలోకి వస్తున్నాయి. గతంలో పలు సందర్భాలలో చిరుతపులులు భక్తులపై దాడులు చేసిన ఘటనలు జరిగాయి. తిరుమలలో మళ్లీ చిరుత సంచారం ప్రస్తుతం సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది.
సీసీటీవీ ఫుటేజ్
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం
గాలి గోపురం వద్ద అర్ధరాత్రి సంచరించిన చిరుత పులి
రాత్రి 10 గంటల తర్వాత కాలినడక మార్గాన భక్తులు ఎవరిని అనుమతించకపోవడంతో తప్పిన పెను ప్రమాదం pic.twitter.com/dJSuoHADjh
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025
తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. గతవారం రోజుల కిందట తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. విశ్వవిద్యాలయ వసతి గృహాల వద్ద చిరుత సంచారంతో విద్యార్థులంతా భయాందోళనలకు గురైన విషయం తెలిసిందే.
నెల రోజుల క్రితం.. అలిపిరి వేదిక్ వర్సిటీ వద్ద కూడా టీటీడీ ఉద్యొగి చిరుతను చూసి భయంతో కింద పడిపోయాడు. ఈ క్రమంలో మళ్లీ చిరుత సంచారం ఘటనతో ఒక వైపు అధికారులు మరోవైపు భక్తులు కూడా తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.
Read more: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త.. ఆ సమస్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..!
దీంతో ఇప్పటికే యానిమల్ రేడియో కాలర్ సిస్టం విధానాన్ని అమలు చేయాలని టీటీడీ ప్లాన్ చేసింది. దీనిపై వైల్డ్‌లైఫ్ అధికారుల అనుమతి కోరారు. అయితే.. ప్రస్తుతం మరోసారి తిరుమలలో చిరుత సంచారంతో మళ్లీ అధికారులు దీనిపైన సీరియస్ గా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









