AP Budget: ఏపీ బడ్జెట్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలకు ఒక పేజీ?

AP Budget Slams On YS Jagan: తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ ప్రసంగంలోనూ గత సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసింది. బడ్జెట్‌ ప్రసంగంలో పరోక్షంగా జగన్‌పై విరుచుకుపడింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 28, 2025, 02:53 PM IST
AP Budget: ఏపీ బడ్జెట్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలకు ఒక పేజీ?

AP Budget 2025-26: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యంగా విమర్శలు, తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనపై విమర్శలు చూస్తుంటే ఆ విమర్శల కోసం మొత్తం బడ్జెట్‌లో ఒక పేజీ ఉంచారా? అనే అనుమానం కలుగుతోంది. అంతలా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు ఉన్నాయి. ఒక చెత్త ప్రభుత్వం అని పరోక్ష విమర్శలు చేయగా.. వారసత్వంగా చెత్తను ఇచ్చారంటూ తీవ్రస్థాయిలో బడ్జెట్‌ ప్రసంగం ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: Gorantla Madhav: తర్వాతి అరెస్ట్‌ గోరంట్ల మాధవ్‌..? పోలీసుల నోటీసు అందజేత!

బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకుమించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని జగన్‌ పాలనపై విమర్శలు చేశారు.

Also Read: AP Budget: రేపే రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్? ఏపీ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇవే?

అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగంలో విమర్శించారు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదని పేర్కొన్నారు.

గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన చెత్త ప్రభుత్వం వ్యాఖ్యలను మంత్రి పయ్యావుల కేశవ్‌  గుర్తు చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపక్షంలో ఉండగా చెత్త పన్ను వేసిన గత పాలకులపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 'అప్పులనే కాదు.. చెత్తను వారసత్వంగా ఇచ్చింది గత ప్రభుత్వం' అంటూ మంత్రి తెలిపారు. చెత్త పన్ను వేయడమే కాకుండా.. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండానే వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయింది అని పయ్యావుల కేశవ్‌ ఉగర్తుచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News