Andhra Pradesh SSC Results 2025 LIVE Updates: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. నేడు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్ ఫలితాలతోపాటు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను కూడా వెల్లడించనున్నారు. ఈ మేరకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటిస్తారు. విద్యార్థులు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్స్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 95523 00009 ద్వారా కూడా రిజల్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి. పదో తరగతి ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









