Live News Telugu: నేడే రైతుల ఖాతాల్లో రూ.7 వేలు.. ఇలా చెక్ చేసుకోండి

Annadata Sukhibhava PM Kisan Status: ఏపీలో అన్నదాత సుఖీభవ స్కీమ్ ప్రారంభం, ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి..? ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఇతర లేటెస్ట్ తెలుగు న్యూస్ లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Written by - Ashok Krindinti | Last Updated : Aug 2, 2025, 08:43 AM IST
Live News Telugu: నేడే రైతుల ఖాతాల్లో రూ.7 వేలు.. ఇలా చెక్ చేసుకోండి
Live Blog

Annadata Sukhibhava PM Kisan Status: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించన్నారు. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇక ఢిల్లీలోని ఏఐసీసీ వార్షిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్ర పరిధిలోని నేషనల్ హైవేలకు సంబంధించిన రూ.5233 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాల్సిందే. నేడు రాశి ఫలాలు, బంగారం ధరలు, వర్షాలకు సంబంధించిన అప్‌డేట్స్, ఏపీ, తెలంగాణ లేటెస్ట్ న్యూస్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

2 August, 2025

  • 08:42 AM

    Telangana News Updates: తనను ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టిందనే మనస్థాపంతో సూర్యాపేట జిల్లా మోతె మండలం బోడబండ్లగూడెనికి చెందిన ఏపూరి ప్రవీణ్‌(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మాయి ఫోన్ నంబరును బ్లాక్‌లో పెట్టడం.. వేరే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న ప్రవీణ్.. గడ్డి మందు తాగి ప్రాణాలు వదిలాడు. 

  • 07:46 AM

    Andhra Pradesh News Live Updates: అమరావతి: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    - ఉదయం 10:30 గంటలకు దర్శికి చంద్రబాబు

    - దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో.. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

    - దర్శిలో టీడీపీ క్యాడర్‌తో భేటీకానున్న చంద్రబాబు

  • 07:13 AM

    Gold Price Today in India: బంగారం, వెండి ధరలకు ఇటీవల రెక్కలు వచ్చాయి. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నేడు బంగారం ధరలు ఉన్నాయి..? త్వరలో గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉందా..? పూర్తి సమాచారం ఇక్కడ చదవండి

  • 07:03 AM

    Today Horoscope in Telugu: శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం 2025 ఆగస్టు 2వ తేదీ శనివారం రాశి ఫలాలు ఉన్నాయి..? ఏ రాశి వారికి నేడు కలిసి వస్తుంది..? కొత్త పనులు ప్రారంభించడానికి ఎవరికి అనుకూలం..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Trending News