)
శంషాబాద్ ఎయిర్ పోర్ట్......
శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వెళాల్సిన విమానాలు రద్దు...
శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 17 విమానాలు రద్దు..
విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి నుంచి శంషాబాద్ రావాల్సిన 18 విమానాలు రద్దు...
మొంథా కారణంగా అనుకూలించని వాతావరణం
ముందస్తు జాగ్రత్తగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో విమానాలు రద్దు
అంబేద్కర్ కోనసీమ జిల్లా...మొంథా తుఫాన్ అమలాపురం సమీపంలో తీరం దాటే అవకాశం
అమలాపురం వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి
..... మహేష్ కుమార్,
అంబేద్కర్ కొనసీమ జిల్లా కలెక్టర్
తుఫాన్ అమలాపురం సమీపంలో తీరం దాటితే సముద్రతీరంలో అలల తీవ్రత పెరుగుతుంది
సముద్రం 180 మీటర్ల ముందుకి వచ్చే అవకాశం
సముద్రతీరంలోని ఎస్ యానం, గచ్చకాయలపొర గ్రామాల వద్ద
పక్కా ఇళ్లలో నివసించే వారిని
కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తాం
మధ్యాహ్నం నుంచి గాలులు వర్షం, తీవ్రత పెరుగుతాయి
ప్రజల అప్రమత్తంగా ఉండాలి
.... కలెక్టర్ మహేష్ కుమార్,
ఎస్పీ రాహుల్ మీనా
ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
మొంథా తుఫాన్ నేపథ్యంలో నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపు
లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచన
• తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి.
• మొంథా తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
• ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కి.మీ దూరం నుంచి 15 కి.మీ వేగంతో రాష్ట్రం వైపు వస్తోంది.
• ఈ రోజు రాత్రికి సివియర్ సైక్లోన్ గా మారి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరం దాటుతుంది.
• కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• ఎన్డీయే శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలి.
• పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నాం.
• పంటలను మునకనుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశాం.
• ప్రాణా నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
• ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎన్డీయే కార్యకర్తలు స్వచ్ఛంధ సేవకులుగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి.
• అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతాం.
• ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం.
• సంక్షోభ సమయాల్లో ప్రజల చెంతనే ఉండాలి.
• తుఫాను సహయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలి.
• వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణిలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
• తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.
• విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా వ్యవహరిస్తారనే నమ్మకం ప్రభుత్వంపై ఉంది.
• మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం.
•చెట్లు, స్తంభాలు వంటివి కూలినా యుద్దప్రాతిపదిన తొలగించే ఏర్పాట్లు చేస్తున్నాం.
• ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించాం.
• సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారులను వెనక్కి రప్పించాం.. వారితోనూ ఎన్డీయే శ్రేణులు సమన్వయంతో ఉండాలి.
• ప్రతి గంటకు బులిటెన్ కూడా విడుదల చేస్తాం.
• మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా కేడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా నిలబడాలి.
• కూటమిని ఆదరించిన ప్రజలకు మనం తోడుగా ఉండాలి.
•దాదాపు 39 నియోజకవర్గాలకు వర్ష ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది
విశాఖ సముద్ర తీరం వెంబడి గంటకి 70 నుంచి వేగంతో ఈదురు గాలులు
పది అడుగుల పైకి ఎగసిపడుతున్న సముద్రపు అలలు
విశాఖ పోర్టుకు ఏడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ..
మొంథా తుపాను నేపథ్యంలో కొండ ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. మొంథా తుపాను నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండేందుకు అన్నీ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బంధోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపధ్యంలో ఈ రోజు నగర పోలీసు కమిషనర్ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిదిలోని కొండ చరియలు విరిగిపడేందుకు అవకాశమున్న కొండ ప్రాంతాలను పరిశీలించి అక్కడి ప్రజలకు మొంథా తుపాను నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్య ప్రమాధాలకు గురికాకుండా ఉండాలనే సదుద్దేశంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకుఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ శఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు మాట్లాడుతూ.... మొంథా తుపాను నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా ఉండేందుకు సిబ్బంది అంధర్ని అప్రమత్తం చేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింధని, ఎక్కడైనా వాగులు వంకలు పొంగినా వెంటనే డ్రోన్ కెమెరాల ద్వారా ఆ ప్రదేశాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమస్య తీవ్రతను గమనిస్తూ అధికారులకు తెలియజేసే విధంగా చర్యలు చేపట్టినట్లు, అధెవిధంగా కొండ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలియజేశారు. అన్నీ శాఖలను సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారితోపాటు పశ్చిమ ఏ.సి.పి. శ్రీ దుర్గారావు గారు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ చిన్న కొండల రావు గారు, ఒన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ గురు ప్రకాష్ గారు, ఎస్.బి.ఇన్స్పెక్టర్ శ్రీ డి.వి.రమణ గారు, ఇన్స్పెక్టర్ శ్రీ గుణరామ్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తుపాను సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలన్న సీఎం గారి ఆదేశాల మేరకు కోస్తా జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలురియల్‌టైమ్ వాయిస్ అలర్ట్‌లను క్షణాల్లో అందిస్తున్నారు.
విద్యుత్ అంతరాయం జరిగినా 360° హార్న్ స్పీకర్ వ్యవస్థ, ఒక కిలోమీటరు పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది.ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించునున్నారు.
ప్రజలకు మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా, అన్ని విధాలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచన..
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా బలపడిన మొంథా
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి మచిలీపట్నంకి 160 కిమీ, కాకినాడకి 240 కిమీ, విశాఖపట్నంకి 320 కిమీ దూరంలో కేంద్రీకృతం
ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం
తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు,
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ
మొంథా తుఫాన్ కాకినాడ జిల్లాను వణికిస్తోంది. ముఖ్యంగా తీరప్రాంతలైన కాకినాడ రూరల్, యూ కొత్తపల్లి మండలాలలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజవర్గంలోని యూ కొత్తపల్లి మండలంలో జిల్లా యంత్రాంగమంతా పర్యటిస్తోంది .మరోపక్క బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాలు, సముద్రానికి దగ్గరగా ఉన్నవారిని ఆయా ప్రాంతాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు .
వాయిస్:269 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ 260 కేంద్రాలు పని చేస్తున్నాయి .ఉప్పాడలో కొందరు మహిళలు పనులకు వెళ్లేందుకు ఆటోలు ఎక్కుతుండగా కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు వారిని నిలిపివేశారు. ముందుకు వెళితే వెనక్కి రాలేని పరిస్థితి. యాజమాన్యాలతో మేము మాట్లాడుతాము వెనక్కి వెళ్లిపోండంటూ వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాసా కేంద్రాలలో ఉదయాన్నే అల్పాహారం అందజేశారు. సోమవారం పలువురు మత్స్యకారులు తమకు ఆహారం పెట్టడం లేదంటూ చేసిన ఆరోపణలను "జీ తెలుగు న్యూస్" ప్రసారం చేయడంతో రాత్రికి అలెర్ట్ అయ్యారు. రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాధితులందరూ ఆయా పునరావాస కేంద్రాలలోనే ఉన్నారు. సోమవారం రూరల్ కాలువలో లో గల్లంతయిన బాలుడి కోసం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
తమిళనాడులో భారీ వర్షాలు
కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోత
చెన్నైలో ఎడతెరిపిలేకుండా వర్షం
చెన్నై,తిరువళ్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
దూసుకొస్తున్న మొంథా తుపాన్ తీర ప్రాంత వాసుల్లో అలజడి సృష్టిస్తోంది. తుపాన్ ప్రభావం కృష్ణాజిల్లా పై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. తుపాన్ ప్రభావం సోమవారం జిల్లాలో స్వల్పంగా కనిపించింది. మోస్తరు వర్షంతోపాటు చలిగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో తుపాన్ తీవ్రత పెరిగి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఈదురు గాలుల కూడా తీవ్రంగా ఉంటాయని నేపథ్యంలో తుపాన్ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. హంసలదీవి బీచ్ లలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటకుల అనుమతిని పూర్తిగా నిలిపివేశారు. పాలకాయతిప్ప వద్ద బీచ్ గేట్లను మూసి మెరైన్ పోలీసులు పహారా కాస్తున్నారు. మత్స్యకారులకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సముద్ర తీర వాసులను కొంతమేరకు తరలించారు.
మొంథా తుపాను ముంచుతోంది. గంటకు 15 km వేగంతో కదులుతున్న తుపాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా, దాదాపు 18గంటల పాటు ప్రభావం చూపుతుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. విజయవాడలో ప్రారంభమైన వర్షంనగరంలో 162 మీల్లిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్, వీసీ కమిషనర్..ప్రజల సురక్షితార్ధం తమ సూచనలు పాటించాలని విజ్ఞప్తి
దుకాణాలు, వాణిజ్య సంస్థల సూచనలని
అత్యవసర సేవల కోసం మాత్రమే ప్రజలు బయటికిరావాలని సూచనలు
మెడికల్ షాపులు, కూరగాయలు, పాలకేంద్రాల వంటి సేవా కేంద్రాల తెరవాలని సూచనలు
రోడ్లపై అనవసర ట్రాఫిక్, ట్రాఫిక్ నివారించాలని ప్రజలకు హితవు
అవసరం లేని ప్రయాణాలు, షాపింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి
9154970454, 08662424172 అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడానికి సూచన
జిల్లా, ప్రత్యేక డివిజన్, మండల, వీసీ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 41 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
కొండపై ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
కోనసీమ ప్రజలను వణికిస్తున్న మొంథా తుఫాన్ హెచ్చరికలు
1996 నాటి పెను తుఫాన్ గుర్తుచేసుకొని భయాందోళన చెందుతున్న కోనసీమ వాసులు
జిల్లాలోని సముద్ర తీరంలో ఉన్న 34 గ్రామాలు సహా కచ్చా ఇల్లు, పూరి గుడిసెల్లో ప్రజలపై అధికారులు ప్రత్యేక దృష్టి
వారికి నచ్చచెప్పి తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న యంత్రాంగం
6 వేల మందిని తరలించేందుకు 120 పునరావాసు కేంద్రాలు ఏర్పాటు
అమలాపురం, సఖినేటిపల్లిలో మోహరించిన ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు
ఎక్కడైనా ఘటన జరిగితే 30 నిమిషాల్లో చేరుకునేలా సిద్ధంగా ఉన్న ఎన్డిఆర్ఎఫ్
కాట్రేనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం,
మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో తీర ప్రాంత మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
కాట్రేనికోన మండలంలో మత్స్యకారు దీవి
గ్రామం మగసానితిప్ప నుంచి 80 మందిని సురక్షిత ప్రాంతానికి తరలింపు
అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద బోట్లను నిలిపివేసిన మత్స్యకారులు
మలికిపురం మం. కేశనపల్లి తుఫాన్ షెల్టర్ లోఆశ్రయం పొందుతున్న మత్స్యకారులు
తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి వి.విజయ రామరాజు, జిల్లా కలెక్టర్
ఆర్ మహేష్ కుమార్
పునరావస కేంద్రాల్లో ఆహారం తయారీ, వసతి, వైద్యశిబిరం తదితర ఏర్పాట్లు
ఎటువంటి అలసత్వం లేకుండా ప్రజలంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిక
జిల్లా స్థాయి నుంచి సచివాలయాల స్థాయి వరకు 24/7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇవాళ్టి షెడ్యూల్
• ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి రానున్న సీఎం
• 11.00 గంటలకు జిల్లాల పునర్విభజనపై సమీక్ష చేయనున్న సీఎం
• 12.00 గంటలకు మొంథా తుఫాన్‌పై సమీక్ష చేయనున్న సీఎం
• సాయంత్రం 05.45 గంటలకు నివాసానికి చేరుకోనున్న సీఎం
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ తెలిపింది. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని..ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, జగిత్యాల, గద్వాల, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి ఇవాళ 13 విమాన సర్వీసులు రద్దు
రాజమడ్రి - హైదరాబాద్ కు రాకపోకలు సాగించే
10 విమాన సర్వీసులు సహా
చెన్నై, బెంగళూరు, ముంబై విమానాలు రద్దు
ఉదయం 8 గంటలకు హైదరాబాద్, 10 గంటలకు ఢిల్లీ విమానాలు మాత్రమే రాజమండ్రి నుంచి
రాకపోకలు
విశాఖపట్నంలో వింత వాతావరణం.. పది నిమిషాల్లో ముందు భయంకరమైన గాలులు భారీ వర్షం. పది నిమిషాల తర్వాత వాన గాలి లేదు ఓన్లీ ఎండ..
విశాఖ లొ వింత వాతావరణం, పది నిమిషాలా ముందు భారీ ఈదురు గాలులతో కుమ్మేసిన వర్షం ఎండ రావడంతొ ప్రజలు వింతగా చూస్తున్నారు.
దీంతో అందరూ రాకాసి తుఫాను నుండి తప్పించుకున్నామా అంటూ ఆనంద పడుతున్న ప్రజలు.
అల్లూరి జిల్లా డొంకరాయి జాలాశయం నుంచి 15000 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు.
డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా, ప్రస్తుతం 1034.50 అడుగులకు చేరుకోవడంతో, సోమవారం 7 గేట్లు ఎత్తి 15 వేలు క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్న ఏపీ జెన్ కో అధికారులు.
డొంకరాయి జలాశయం నీటిమట్టం తగ్గేవరకూ నీటి విడుదల కొనసాగుతుందని తెలిపిన జెన్‌కో అధికారులు .
మొంథ తుఫాను ప్రభావం నేడు ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఎక్కువ ప్రభావం ఉండనుంది. కలెక్టర్ కీలక ఆదేశాలు..
విజయవాడ నగరంలో, సుమారు **162 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు తప్పని సరి అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి.
పిల్లలు, వృద్దులను ఇంట్లోనే ఉంచాలని విజ్ఞప్తి.
చెట్ల కింద, హోర్డింగ్ లుకింద, పాత భవనాల్లో ఎవరూ ఉండకండి.
మూడు రోజులపాటు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలకు సెలవు ప్రకటించారు.
ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ కలెక్టర్ ఆదేశించారు.
నేడు, రేపు కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
ఎవరూనా నిర్వహిస్తే కంట్రోల్ రూమ్ కు కాల్ చేయండి
ప్రజల ప్రాణాలు కన్నా ఏదీ ఎక్కువ కాదు... అందరూ జాగ్రత్తగా ఉండండని సూచనలు చేశారు.
మొంథా తుపాను ఎఫెక్ట్ దక్షిణ మధ్య రైల్వే - రైళ్ల రద్దు
ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలు
అవాంఛనీయ ఘటనలు నివారణ కోసం ముందస్తుగా పలు రైళ్లు రద్దు.
విజయవాడ డివిజన్ మీదుగా నడిచే 54 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.
విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లు రద్దు చేసిన అధికారులు.
నేడు, రేపు, బయలుదేరే రైలు ప్యాంసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేసిన అధికారులు.
రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు,కాకినాడ నుంచి బయలు దేరే పలురైళ్లును రద్దు చేసిన అధికారులు.
తెనాలి, రేపల్లె,మార్కాపురం, మచిలీపట్నం,నర్సాపూర్ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసిన అధికారులు
విశాఖ,,ఒంగోలు,భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలురైళ్లు రద్దు.
రద్దైన రైళ్ల వివరాలుscr.indianrailways.gov.in వెబ్ సైట్లో లభ్యం .
రద్దు చేసిన రైళ్ల వివరాలను ప్రయాణికులకు మొబైల్ సందేశాలు పంపిన రైల్వే.
రద్దైన రైళ్లలో ప్రయాణికులకు టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్న రైల్వే అధికారులు..
మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆరా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జేపీ నడ్డా మొంథా తుపాను ప్రభావంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మొంథా ప్రభావం 17 జిల్లాలపై కనిపించే అవకాశముందని చెప్పారు. తుపాను ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైద్యారోగ్య శాఖ కూడా ముందస్తు జాగ్రత్తతో అవసరమైన చోట్ల ప్రజలకు సేవలందించేలా రెడీగా ఉందని జగత్ ప్రకాష నడ్డాకు మంత్రి సత్యకుమార్ వివరించారు. అనంతరoజేపీ నడ్డా మాట్లాడుతూ...పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేలా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వాలని సూచించారు.కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోనియు కొత్తపల్లి మండలంలో కుండపోత వర్షం.. ఈదురు గాలులతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
నేడు విజయవాడ దుకాణాలు బంద్.
* ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..
* భారీ వర్షాలకు అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్..
* రేపు విజయవాడలో షాపులు మూసేయాలని కలెక్టర్ ఆదేశం..
* మెడికల్, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు..
* అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచన..
మొంథా తుఫానుపై ఆందోళన వద్దు...అప్రమత్తంగా ఉందాం మని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు.
నేటి నుంచి పెరగనున్న తుఫాను ప్రభావం....338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం
తుఫాను ప్రభావంపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు
ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలెర్ట్ చేసే అవకాశం
మంత్రులు, అధికారులతో రాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 338 మండలాలు, 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే మొంథా తుఫానుపై ఆందోళన వద్దని...అప్రమత్తంగా ఉందామని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు మరోసారి తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్ లో సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్ తో పాటు....రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి తుఫాను తీవ్రత పెరగనన్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని చంద్రబాబు సూచించారు. అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సిఎం సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్దతపై ఐవిఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైనా సీఎం సమీక్ష చేశారు. అధికారులు ఎన్ని రివ్యూలు నిర్వహించారు అనేది కాదు...క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని...దీనికి పబ్లిక్ పర్సెప్షన్ ను ప్రాతిపదికగా తీసుకోవాలని సిఎం సూచించారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. అదే విధంగా తుఫానుకు సంబంధించిన జాగ్రత్తలపై మీమీ.. ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అని అంశంపై 70 శాతం మంది అవును అన్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెపుతున్నాయని అధికారులు తెలిపారు. దీన్ని కొనసాగించాలని...ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు...వారి అవసరాలు, ఇబ్బందులు కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సిఎం అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేక్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొట్టమొదటి సారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేశామని.....రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టిజీ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ ఉదయం లోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముప్పు తప్పే వరకూ ప్రతీ శాఖ, ప్రతీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సిఎం సూచించారు
తుఫాను ప్రభావంతో విశాఖ విమానాలు రద్దు
తుఫాను 'మొంథా' తీవ్రతరం అవుతుందన్న అంచనాలతో, అక్టోబర్ 28న విశాఖ నుంచి బయలుదేరే, అక్కడికి చేరుకునే 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ 27న దిల్లీ నుండి బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం సరిగా లేకపోవడంతో భువనేశ్వర్‌కు మళ్లించబడింది. విజయవాడ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-2743 రద్దు చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో మోంథా తుఫాన్ ఎఫెక్ట్...
మోంథా తుఫాన్ కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు.
రేపు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి రాకపోకలు సాగించే 8 సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా.
IX 2819 వైజాగ్- గన్నవరం
IX-2862 గన్నవరం - హైదరాబాద్
I X-2875 బెంగళూరు- గన్నవరం
I X-2876 గన్నవరం - బెంగళూరు
IX-976 షార్జా-గన్నవరం
IX-975 గన్నవరం -షార్జా
IX2743 హైదరాబాద్-గన్నవరం
I X-2743 గన్నవరం -వైజాగ్
Cyclone Montha Effect on Andhra Pradesh:ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంలో వాయు గుండం బలపడింది. అంతేకాదు మరికాసేట్లో తీవ్ర తుపానుగా మారనుంది మొంథా. ఈ రోజు సాయంత్రానికి లేదా రాత్రికి తీరం దాటే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాక తెలిపింది. ఇది కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ తీవ్రత మరో 18 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రానికి ఆనుకొని ఉండే కోస్తాంధ్ర ప్రాంతానికి తుపాను ముప్పు ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం విశాఖ, విజయవాడ, నెల్లూరు వైపు వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. అటు విమాన సర్వీసులను కూడా రద్దు చేసారు. పరిస్థితులు కుదట పడేదాకా రైల్లు, విమాన సర్వీసులు నడపకూడదని ప్రభుత్వానికి వాతావరణ శాఖ తెలిపింది. అప్పట్లో వచ్చిన ‘హుద్ హుద్’ తుపాను అత్యంత భారీగా మొంథా తుపాను ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువ ఉండే ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్లకు ఆహారం, నీళ్లతో పాటు దుప్పట్లు, పారిశుద్ధానికి సంబంధించిన పనులపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. మొంథా తుపానుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.