AP Budget Session 2025 Live Updates: చంద్రబాబు సర్కారు ఏపీ బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెబోతుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేడు ఉదయం 10 గంటలకు సభలో బడ్జెట్ ప్రసంగం మొదలవుతుంది. అంతకుముందు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రూ.3.24లక్షల కోట్ల అంచనాలతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో రూ.2.94 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ కంటే ఈసారి 10 శాతం అధిక అంచనాలతో బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు సమాచారం. ఏయే శాఖలకు ఎంత కేటాయించనున్నారు..? ఏ పథకాలను ఎన్ని నిధులు ఇవ్వనున్నారు..? ఏపీ బడ్జెట్ ఎలా ఉండబోతుంది..? లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









