AP Inter Results 2025 Live: ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అప్‌డేట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఆ రోజే నుంచే..!

AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు శనివారం రిలీజ్ చేయనున్నారు. ఫస్టియర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తారు. ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ రిజల్ట్స్‌ లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 12, 2025, 12:08 PM IST
AP Inter Results 2025 Live: ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అప్‌డేట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఆ రోజే నుంచే..!
Live Blog

AP Inter Results Check On resultsbie.ap.gov.in: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం మొత్తం 1535 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. గతంలో మాదిరి కాకుండా ఈసారి మరింత ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం వాట్సాప్ నంబరును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.  95523 00009 నంబరుకు HI అని మెసేజ్ చేసి.. అవసరమైన వివరాలను అందిస్తే ఫలితాలు PDF రూపంలో వస్తాయి. రిజల్ట్స్‌ను మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. 

12 April, 2025

  • 12:08 PM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ పరీక్షలకు 39,783 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 27,276 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 62 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేయగా.. బాలికలు 74% ఉత్తీర్ణత సాధించారు.

  • 12:02 PM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: జనరల్ కేటగిరీకి సంబంధించిన 50,314 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా.. 23,799 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 39,783 మంది విద్యార్థులు హాజరు కాగా 27,276 మంది ఉత్తీర్ణులయ్యారు. 

  • 11:50 AM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ఫస్టియర్: 70 శాతం ఉత్తీర్ణత 

    ==> సెకండియర్: 83 శాతం ఉత్తీర్ణత 

  • 11:44 AM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ  నుంచి 22వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.

  • 11:29 AM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. 30 సెకండ్లలోనే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

  • 11:25 AM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో (GJCలు) 2వ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి 69 శాతానికి చేరుకుందని మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. 1వ సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత 47 శాతంగా ఉందన్నారు. ఇది గత దశాబ్దంలో రెండవ అత్యధికమన్నారు. 

  • 11:22 AM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో (GJCలు) 2వ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి 69 శాతానికి చేరుకుందని మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. 1వ సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత 47 శాతంగా ఉందన్నారు. ఇది గత దశాబ్దంలో రెండవ అత్యధికమన్నారు. 

  • 11:13 AM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియరలో 83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.

  • 11:07 AM

    AP 1st and 2nd Year Inter Resuts 2025 Live Updates: ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఫలితాలను వెల్లడించారు. 
     

  • 11:05 AM
  • 10:31 AM

    AP Inter Results 2025 Direct Links: విద్యార్థులు ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

    ==> అధికారిక వెబ్‌సైట్: resultsbie.ap.gov.in
    ==> వాట్సాప్ ద్వారా: వాట్సాప్‌లో 95523 00009 కు "Hi" సందేశం పంపండి.

  • 10:26 AM

    How To Check AP Inter 2025 Results on DigiLocker: డిజిలాకర్‌లో ఏపీ ఇంటర్ 2025 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి. 

    ==> అధికారిక డిజిలాకర్ వెబ్‌సైట్ digilocker.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.

    ==> హోమ్‌పేజీలో 'విద్య' విభాగాన్ని ఎంచుకోండి.

    ==> ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. సంబంధిత పరీక్ష బోర్డును ఎంచుకోండి.

    ==> ఏపీ ఇంటర్ 1వ సంవత్సరం ఫలితాలు 2025 లేదా ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు 2025 అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ వివరాలను ఎంటర్ చేయండి.

    ==> రిజల్ట్స్ డిస్‌ప్లేపై ప్రత్యక్షం అవుతాయి. 

  • 10:23 AM

    How To Check AP Inter 2025 Results on DigiLocker: డిజిలాకర్‌లో ఏపీ ఇంటర్ 2025 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి. 

    ==> అధికారిక డిజిలాకర్ వెబ్‌సైట్ digilocker.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.

    ==> హోమ్‌పేజీలో 'విద్య' విభాగాన్ని ఎంచుకోండి.

    ==> ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. సంబంధిత పరీక్ష బోర్డును ఎంచుకోండి.

    ==> ఏపీ ఇంటర్ 1వ సంవత్సరం ఫలితాలు 2025 లేదా ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు 2025 అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ వివరాలను ఎంటర్ చేయండి.

    ==> రిజల్ట్స్ డిస్‌ప్లేపై ప్రత్యక్షం అవుతాయి.

  • 09:52 AM
  • 09:47 AM

    AP Inter Results Whatsapp Number: విద్యార్థులు తమ ఫలితాలను WhatsApp ద్వారా కూడా పొందవచ్చు . మన మిత్ర అధికారిక WhatsApp నంబర్ 95523 00009 కు HI అని మెసేజ్ పంపండి. మీ వివరాలను ఎంటర్ చేస్తే.. పీడీఎఫ్‌ రూపంలో ఫలితాలు వస్తాయి.
     

  • 09:10 AM

    AP Inter Results Live Updates: ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలి. 
     

  • 09:00 AM

    AP Inter Results Live Updates: ఇంటర్మీడియట్ మార్కుల షీట్‌లో విద్యార్థులు పొందిన సబ్జెక్టుల వారీగా మార్కులు ఉంటాయి. ఒరిజనల్ మార్క్స్‌ షీట్ కోసం ఫలితాలు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత విద్యార్థులు తమ కాలేజీల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
     

  • 08:51 AM

    AP Inter Results Live News: ఈసారి ఇంటర్ ఫలితాలను ఎలాంటి హడావుడి లేకుండా విడుదల చేయనున్నారు. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం.. అందుకు కొంత మొత్తంలో ఖర్చు చేయడం.. ఫలితాలు అనుకున్న సమయానికి విడుదల కాకపోవడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా ఫలితాలను వెల్లడించనున్నారు.
     

  • 08:30 AM

    AP Inter Results Check via SMS: ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా ఫలితాలను ఇలా తెలుసుకోండి.

    ==> మొదటి సంవత్సరం: APGEN1 అని టైప్ చేసి.. స్పెస్ ఇచ్చి మీ హాల్ టికెట్ నంబర్‌ను టైప్ చేయండి.

    ==> 2వ సంవత్సరం: APGEN2 అని టైప్ చేసి.. స్పెస్ ఇచ్చి మీ హాల్ టికెట్ నంబర్‌ను టైప్ చేయండి.

    ==> 56263 నంబరుకు మెసేజ్ పంపించండి. 

    ==> ఫలితాలు ఎస్‌ఎమ్ఎస్ రూపంలో మీ నంబరుకు వస్తాయి.

  • 08:18 AM

    How to Check AP Inter Results: ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
     
    ==> ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ ని సందర్శించండి.

    ==> హోమ్‌పేజీలో ఫలితాలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. IPE మార్చి 2025 1వ లేదా 2వ సంవత్సరం ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

    ==> మీ హాల్ టికెట్ వివరాలను ఎంటర్ చేయండి. 

    ==> సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే.. ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతాయి. 

Trending News