AP POLYCET Results 2025 LIVE Updates: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలకానున్నాయి. ఇందుకోసం టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం సర్వర్లలోకి డేటా అప్‌డేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన తర్వాత అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://polycetap.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోచవ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిజల్ట్స్ వెల్లడి అనంతరం ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. AP POLYCET Results 2025 లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









