Add Zee Business As A Preferred Source
App
Live Now

Cyclone Montha LIVE Andra Pradesh: హై అలర్ట్.. తీరాన్ని తాకిన మొంథా తుపాను.. ఎక్కడంటే

Cyclone Montha Live Updates: మొంథా తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలినట్లు APSDMA వెల్లడించింది. ఈ రోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తుపాను ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Cyclone Montha LIVE Andra Pradesh: హై అలర్ట్.. తీరాన్ని తాకిన మొంథా తుపాను.. ఎక్కడంటే
Image Credit: Cyclone Montha Live
28 October 2025 10:47 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: తుఫాను ప్రభావం ఉన్న గ్రామ-వార్డు...

Andhra Pradesh Cyclone Montha Live Updates: తుఫాను ప్రభావం ఉన్న గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

•    తుఫాన్ తీరాన్ని తాకింది... అర్ధరాత్రికి తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నాం

•    కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోంది

•    భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి... వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం

•    గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందే

•    బాధితులకు తక్షణ సాయం అందేలా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూడాలి... స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియచేయాలి
•    విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట, వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి.

28 October 2025 10:46 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: ఇవాళ రాత్రికి ఏపీ సచివాలయంలోనే...

Andhra Pradesh Cyclone Montha Live Updates: ఇవాళ రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు. 

తుఫాన్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న చంద్రబాబు. 

మొంథా తుఫాన్‍పై మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సూచనలు.. ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

28 October 2025 10:45 PM (IST)

...

28 October 2025 10:45 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: అమరావతి.. తుఫాను పరిస్థితిపై ఏపీ...

Andhra Pradesh Cyclone Montha Live Updates: అమరావతి.. తుఫాను పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

- జరుగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి

- కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన అశ్విని వైష్ణవ్.

28 October 2025 10:41 PM (IST)

...

28 October 2025 10:39 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: రాత్రి 10 గంటల నుంచి జిల్లా...

Andhra Pradesh Cyclone Montha Live Updates: రాత్రి 10 గంటల నుంచి జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు ఫోన్ కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లు, సచివాలయం సిబ్బందితో తుఫాన్ ప్రభావంపై ఫోన్ కాన్ఫరెన్స్ లో  వివరాలు అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి

ప్రస్థుత పరిస్థితి, రేపు ఎలాంటి చర్యలు తీసుకోవాలో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

28 October 2025 10:24 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై వరద నీరు...

Andhra Pradesh Cyclone Montha Live Updates: విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై వరద నీరు ఏరులై పారుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొరా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌ మధ్య ట్రాక్‌పై వర్షపు నిలిచిపోగా.. రైల్వే శాఖ ట్రాక్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది.

28 October 2025 10:22 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: అప్రకటిత కర్ఫ్యూని తలపిస్తున్న...

Andhra Pradesh Cyclone Montha Live Updates: అప్రకటిత కర్ఫ్యూని తలపిస్తున్న తుఫాన్‌ ప్రభావిత జిల్లాలు..

షాపులు, సినిమాహాల్లు బంద్‌..

అమరావతిలోనే ఉన్న సీఎం చంద్రబాబు..

జిల్లాల్లో మంత్రులు, అధికారులు పరిస్థితులు సమీక్ష

28 October 2025 10:22 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం....

Andhra Pradesh Cyclone Montha Live Updates: ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం. 
నీటమునిగిన సింగరాయకొండ పోలీస్‌ స్టేషన్‌. 
ఒంగోలు సమీపంలో కొట్టుకుపోయిన కారు. 
సిగ్నల్స్‌ లేకపోవటంతో పనిచేయని మొబైల్‌ నెట్‌వర్క్‌లు. 
కైకలూరులో కుండపోత వర్షం.

28 October 2025 10:21 PM (IST)

28 October 2025 10:19 PM (IST)

Andhra Pradesh Cyclone Montha Live Updates: నెల్లూరులో ముందుకొచ్చిన సముద్రం...

Andhra Pradesh Cyclone Montha Live Updates: నెల్లూరులో ముందుకొచ్చిన సముద్రం 

మొంథా తుపాను ప్రభావంతో నెల్లూరులో వర్షాలు
మైపాడు బీచ్‌ వద్ద 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
పర్యాటకులెవరూ అటు పక్క వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు
తీర ప్రాంతాలను మైక్‌ సెట్‌ల ద్వారా అప్రమత్తం చేస్తున్న పోలీసులు

28 October 2025 10:17 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం...

Andhra Pradesh Weather Live Updates: కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం దగ్గరలో మొంథా తుపాను తీరాన్ని తాకింది. తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. 

28 October 2025 10:13 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: అంధకారంలో కోస్తాంధ్రలోని గ్రామాలు....

Andhra Pradesh Weather Live Updates: అంధకారంలో కోస్తాంధ్రలోని గ్రామాలు. రాబోయే 8-10 గంటలు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని అధికారుల హెచ్చరిక. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10-20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం. గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్న అధికారులు.

28 October 2025 07:43 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: అమరావతి.. రాత్రి 11.30 గంటలకు తుఫాను...

Andhra Pradesh Weather Live Updates: అమరావతి.. రాత్రి 11.30 గంటలకు తుఫాను తీరం దాటుతుందని సమాచారం ఉంది.

- ముఖ్యమంత్రి  ఆధ్వర్యంలో పూర్తి అప్రమత్తతతో అధికార యంత్రాంగం పని చేస్తోంది

- ప్రధాని మోడీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్

28 October 2025 07:00 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ...

Andhra Pradesh Weather Live Updates: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ.గో., ప.గో., అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి రేపు 6 గంటల వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.

28 October 2025 06:50 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: తుపాను ప్రభావంపై సీఎం ఎప్పటికప్పుడు...

Andhra Pradesh Weather Live Updates: తుపాను ప్రభావంపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు: మంత్రి లోకేశ్​

తుపాను పరిస్థితులపై నిన్న ప్రధాని కూడా సీఎంతో మాట్లాడారు

రాష్ట్రానికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని కేంద్రం చెప్పింది

40 లక్షల మంది ప్రజలపై తుపాను ప్రభావం ఉంటుంది

కాకినాడ, కోనసీమ, బాపట్ల, గుంటూరు జిల్లాలపై తుపాను ప్రభావం

తుపానుపై అనిత, నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం

365 గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం

364 పాఠశాలలను తుపాను కేంద్రాలుగా మార్చాం

తుపాను తీరం దాటాక చేయాల్సిన పనులపై సిద్ధంగా ఉన్నాం

ఇప్పటికే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేశాం

ఆర్టీజీఎస్‌లో ఉండి రాత్రి మొత్తం సమీక్ష నిర్వహిస్తా

పంటనష్టం, ఇళ్లు, సహాయ చర్యలపై సీఎం ఇప్పటికే చెప్పారు

సముద్ర తీరాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలను కోరుతున్నాం

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి : మంత్రి లోకేశ్

28 October 2025 06:50 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి 4 గంటల వరకు...

Andhra Pradesh Weather Live Updates: ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి 4 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలు

==> నెల్లూరు జిల్లా ఉలవపాడు 12.6 సెంటిమీటర్లు

==> సింగరాయకొండ        10.5 సెంటీమీటర్లు

==> కావలి                      12.2 సెంటిమీటర్లు

==> దగదర్తి                      12 సెంటిమీటర్లు

==> బి.కోడూరు                  6 సెంటిమీటర్లు

==> కళింగపట్నం                 7 సెంటిమీటర్లు

==> విశాఖ                       2 సెంటిమీటర్లు 

==> తుని                         2 సెంటిమీటర్లు

28 October 2025 06:47 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: కోస్తాంధ్ర తీరాన్ని సమీపిస్తున్న మొంథా...

Andhra Pradesh Weather Live Updates: కోస్తాంధ్ర తీరాన్ని సమీపిస్తున్న మొంథా తుపాను

==> కాకినాడకు దక్షిణంగా ఇవాళ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం

==> తీవ్ర తుపాను కారణంగా కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  ప్రభావం

==> రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాలోని 403 మండలాలపై మొంథా తుపాను ప్రభావం

==> అత్యవసర పరిస్థితి ఎదుర్కోనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూముల ఏర్పాటు 

==> మొత్తం  1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

==> 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు

==> 219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు 

==> అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్ లెస్ టవర్లను ఏర్పాటు చేసిన రాష్ట్రప్రభుత్వం

==> 21కి పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను కూడా సిద్ధం చేసిన ప్రభుత్వం

==> జేసీబీలు, ప్రోక్లెయినర్లు, క్రేన్లు 1447ను, 321 డ్రోన్లను సిద్ధంగా ఉంచిన సర్కారు

==> కూలిన చెట్లు తొలగించేందుకు 1040 యాంత్రిక రంపాలను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం

==> తుపాను ప్రభావంపై  ఇప్పటి వరకూ 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా సంక్షిప్త సమాచారం ద్వారా హెచ్చరికలు జారీ

==> వర్షప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం సిద్ధం చేసిన అధికారులు

==> తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్ల పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా

==> 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా ప్రభావితం అయినట్టు అంచనా 
 

28 October 2025 06:40 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: గడిచిన 24 గంటల్లో 147 మీ.మీ వర్ష పాతం...

Andhra Pradesh Weather Live Updates: గడిచిన 24 గంటల్లో 147 మీ.మీ వర్ష పాతం నమోదు అయిందని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. పడిన చెట్లు వెంటనే తొలగిస్తున్నామని.. కాలువలు పూడికలు తీస్తున్నామని చెప్పారు. కొండవాలు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. రిజర్వాయర్ మేఘాద్రి గెడ్డకు 6000 క్యూసెక్కుల నీరు వచ్చిందని.. తాటిపూడి గంభీరం రిజర్వాయర్ అంత బాగానే ఉందన్నారు. 

 ==> 0891- 2590100.. కలెక్టర్ ఆఫీసు 
==> 180042500009.. జీవీఎంసీ టోల్ ఫ్రీ 
==> 9666909192... జీవీఎంసీ వాట్సాప్ 

28 October 2025 06:35 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్...

Andhra Pradesh Weather Live Updates: తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్ కామెంట్స్..

==> కాకినాడకి 120 కి.మీ దూరంలో ఉంది 

==> అర్ధరాత్రి రాజోలు వద్ద తీరం దాటే అవకాశం ఉంది.. 

==> కోన సీమ, ఏలూరు, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలు పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది 

==> 554 క్యాంపులు పెట్టీ 31వే ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాము 

==> 16320 ప్రజలు నీ కాకినాడ ప్రాంతంలో అత్యధికంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేశాం 

==> కోనసీమ 48 ఏళ్ల మహిళ మరణం విచాకరం

==>అత్యవసరం అయితేనే బయటికి రావాలి..

==> పునరావాస కేంద్రాలు వద్ద నిత్యావసర సరుకులు, మందులు, జెనరేటర్ లు, పాలు అన్ని మౌలిక వసతులు అన్ని అందుబాటులో ఉంచాం 

==> 18000 పోల్స్, 10వేల మంది సిబ్బంది వరకు రెడీ గా ఉన్నారు 

==> రానున్న 12 గంటలు అందరు అలెర్ట్‌గా ఉండాలి 

28 October 2025 05:57 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర...

Andhra Pradesh Weather Live Updates: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్

గడిచిన 6 గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 60 కిమీ, కాకినాడకి  140 కిమీ, విశాఖపట్నంకి 240 కిమీ దూరంలో కేంద్రీకృతం

తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

28 October 2025 05:49 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: మరికొద్ది గంటల్లో తీరానికి చేరువుగా...

Andhra Pradesh Weather Live Updates: మరికొద్ది గంటల్లో తీరానికి చేరువుగా మొంథా తీవ్ర తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దూసుకువస్తున్న మొంథా తీవ్ర తుపాన్

గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి  150 కిమీ, విశాఖపట్నంకు  250 కిమీ దూరంలో కేంద్రీకృతం

మరి కొద్ది గంటల్లో కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం 

దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం

శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు రెడ్ అలెర్ట్ 

కోస్తాంధ్ర లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం 

కాకినాడ పోర్టు కు 10 నెంబర్ ప్రమాద హెచ్చరిక

28 October 2025 04:30 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: రాజోలు ప్రాంతంలో తుఫాన్ తీరం దాటుతుంది:...

Andhra Pradesh Weather Live Updates: రాజోలు ప్రాంతంలో తుఫాన్ తీరం దాటుతుంది: మంత్రి అచ్చెన్నాయుడు

ఎక్కడికడ అధికారులను అప్రమత్తం చేశాం..

కోనసీమ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం..

5000 మందిని పునరావాసాలకు తరలించాం..

విద్యుత్ శాఖ కు సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేశాం..

సాయంత్రం 5 నుంచి 8 గంటల్లోగా తీరం దాటుతుంది..

సాయంత్రం 5 గంటల నుంచి ఎవ్వరు బయటకు రావొద్దు..

కొబ్బరి చెట్టు పడి ఒక వ్యక్తి చనిపోయారు

రైతాంగానికి సంబంధించి తుఫాన్ వచ్చి వెళ్లిపోయిన తరువాత నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తాం..

వరి, అరటి రైతులు నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇస్తాం..

28 October 2025 03:22 PM (IST)

Andhra Pradesh Rains Live Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర...

Andhra Pradesh Rains Live Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్

గడిచిన గంటలో 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 100 కిమీ, కాకినాడకి  180 కిమీ, విశాఖపట్నంకి  270 కిమీ దూరంలో కేంద్రీకృతం

దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం

కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం 

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

28 October 2025 02:59 PM (IST)

Andhra Pradesh Rains Live Updates: అమరావతి.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ...

Andhra Pradesh Rains Live Updates: అమరావతి.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో రహదారులపై ఆంక్షలు

- జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల

- ముందే సురక్షిత లే భై లో నిలుపుకోవాలి

- ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు

~ ఏపీ  విపత్తుల నిర్వహణ సంస్థ

28 October 2025 02:46 PM (IST)

Andhra Pradesh Rains Live Updates: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్...

Andhra Pradesh Rains Live Updates: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్

గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 110 కిమీ, కాకినాడకి  190 కిమీ, విశాఖపట్నంకి  280 కిమీ దూరంలో కేంద్రీకృతం

ఈరోజు రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం 

దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం

కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం 

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

28 October 2025 02:45 PM (IST)

28 October 2025 02:18 PM (IST)

...

28 October 2025 02:18 PM (IST)

Andhra Pradesh Rains Live Updates: మొంథా తుఫాన్  ప్రభావం పెరిగింది. యు...

Andhra Pradesh Rains Live Updates: మొంథా తుఫాన్  ప్రభావం పెరిగింది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ, సూరాడపేట, మాయా పట్నం, కొనపాపాపేట, కొత్తపట్నం, సుబ్బంపేట, పాత మార్కెట్ ప్రాంతాల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈదురు గాలులకు తాటాకిళ్లపై ఆకులు ఎగిరిపోతున్నాయి. పూర్తిస్థాయిలో పునరావాస కేంద్రాలలో  భోజనాలు లేవని ప్రజలు చెబుతున్నారు.  

28 October 2025 02:09 PM (IST)

Andhra Pradesh Rains Live Updates: బుడమేరు పొంగుతుందని ప్రజలను భయాందోళనలకు...

Andhra Pradesh Rains Live Updates: బుడమేరు పొంగుతుందని ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి  కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. ఎటువంటి అపోహలను నమ్మొద్దని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు సూచించారు. మున్నేరు, బుడమేరు మొదలైన అన్ని వాగులు, కాలువల  పరిసర ప్రాంతాలను నిరంతరం డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడా ఎటువంటి అలజడులు  లేవని.. జిల్లా యంత్రాంగం అందరూ అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు.

28 October 2025 02:07 PM (IST)

Andhra Pradesh Rains Live Updates: ఏపీపై మొంథా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్...

Andhra Pradesh Rains Live Updates: ఏపీపై మొంథా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. 
==> సమీక్షకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి.అనిత, పి. నారాయణ, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులు.
 ==> ప్రస్తుతం తుఫాను తీరానికి దగ్గరగా వస్తోందని.. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందన్న అధికారులు.
 ==> కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని చెప్పిన అధికారులు.
 ==> తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి.
 ==> గతంలో వచ్చిన తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
 ==> తుఫాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలు.
 ==> గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్త వహించాలని సూచనలు. 
 ==> విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉందని సీఎంకు తెలిపిన అధికారులు.
 ==> ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని వెల్లడించిన సీఎస్.

28 October 2025 02:05 PM (IST)

Andhra Pradesh Rains Live Updates: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను...

Andhra Pradesh Rains Live Updates: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రతపై క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్

వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేతస్థాయి పరిస్థితులను వాకబు చేసిన మంత్రి నారా లోకేష్

ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఇతర ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి లోకేష్

మొంథా తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ రోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు సూచించిన మంత్రి లోకేష్

అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని శాసనసభ్యులకు సూచించిన మంత్రి లోకేష్

సంక్షోభ సమయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్

డ్రెయిన్లు పొంగి ప్రవహించకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

అలెర్ట్స్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ప్రతి రెండు గంటలకోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్

Add Zee News as a Preferred Source

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More