Add Zee Business As A Preferred Source
App
Live Now

International Yoga Day 2025 Live: వన్ ఎర్త్-వన్ హెల్త్.. సరికొత్త రికార్డు సృష్టించిన యోగాంధ్ర 2025

International Yoga Day 2025 Live Updates: వన్ ఎర్త్-వన్ హెల్త్ నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభంమైది. యోగాంధ్ర 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ హాజరయ్యారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

International Yoga Day 2025 Live: వన్ ఎర్త్-వన్ హెల్త్.. సరికొత్త రికార్డు సృష్టించిన యోగాంధ్ర 2025
Image Credit: International Yoga Day 2025 LIVE
21 June 2025 09:21 AM (IST)

International Yoga Day 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ కార్యక్రమంలో 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు చేయడంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. గతంలో సూరత్‌లో యోగా రికార్డు 1.47 లక్షల మందితో ఉండగా.. తాజాగా యోగాంధ్ర బ్రేక్ చేసింది. 

21 June 2025 08:16 AM (IST)

International Yoga Day 2025 Live Updates: హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే కార్యక్రమం భారీగా నిర్వహించారు. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు హాజరయ్యారు. 

21 June 2025 08:09 AM (IST)

International Yoga Day 2025 Live Updates: యోగాంధ్ర కార్యక్రమంలో అందరితో కలిసి ప్రధాని మోదీ దాదాపు 40 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు. అనంతరం అక్కడ విద్యార్థులతో సంభాషించారు.

21 June 2025 07:56 AM (IST)

International Yoga Day 2025 Live Updates: రాష్ట్ర వ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో ఒకే చోట 3 లక్షల మంది యోగా చేసి రికార్డు నెలకొల్పబోతోందని అన్నారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్‌ సృష్టించారని వెల్లడించారు. సెప్టెంబర్‌ నుంచి యోగా లీగ్‌ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్‌లో యోగాను భాగం చేసేలా కృషి చేయాలని ప్రధానిని కోరారు.

21 June 2025 07:41 AM (IST)

21 June 2025 07:31 AM (IST)

International Yoga Day 2025 Live Updates: యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలను యోగా ఒక్కటి చేసిందన్నారు. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతుగా నిలిచాయని.. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదన్నారు. గత పది సంవత్సరాల్లో కోట్లాది మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. యోగాకు వయసుతో పనిలేదని.. యోగాకు హద్దు లేవన్నారు.

21 June 2025 07:21 AM (IST)

International Yoga Day 2025 Live Updates: యోగా డేకు భారీ స్పందన లభిస్తోంది. విశాఖకు వివిధ ప్రాంతాల ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే ప్రజల రాక మొదలైంది. విశాఖలో ఉదయం 5.45 గంటలకు యోగా సాధనకు 1.50 లక్షల మంది హాజరయ్యారు. సూరత్ లో 1,47,952 మందితో చేసిన యోగా రికార్డు బ్రేక్ అయింది. ప్రాంగణంలో క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు లెక్కిస్తున్నారు.

21 June 2025 07:07 AM (IST)

International Yoga Day 2025 Live Updates: ప్రపంచంలో యోగాను పాపులర్ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. 175 దేశాల్లో.. 12 లక్షల ప్రదేశాల్లో యోగా చేస్తున్నారని చెప్పారు. 

21 June 2025 07:02 AM (IST)

International Yoga Day 2025 Live Updates: విశాఖ వేదికగా జరుగుతున్న యోగాంధ్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. యోగా దినోత్సవం భారతీయులకు దక్కిన గౌరవమని అన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడి కృషితో ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. 

21 June 2025 06:54 AM (IST)

International Yoga Day 2025 Live Updates: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు.

21 June 2025 06:47 AM (IST)

International Yoga Day 2025 Live Updates: "శారీరక శక్తిని, మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరం యోగా. కేవలం ఆసనాలే కాదు, యోగా అంటే మన జీవన విధానం. జీవితంలో క్రమశిక్షణను అలవరుస్తుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్రను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విశాఖలో 5 లక్షల మందితో, రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగాసనాలు నిర్వహించడం జరుగుతోంది. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర లక్ష్యం. యోగా ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు." అని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

Add Zee News as a Preferred Source

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.