)
Kurnool Bus Accident Latest Updates: రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్
- కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్.
- పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు.
- ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు.
- మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని సీఎం ఆదేశశం.
- గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖకు సూచనలు.
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్‌నెస్, సేఫ్టీ , పర్మిట్ తనిఖీలకు ఆదేశాలు.
- అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఆదేశం.
- ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం ఏదైనా తేలితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక.
- ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
- మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారని వెల్లడి.
- ప్రైవేట్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ , పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక కోరిన సీఎం.
- రాష్ట్ర ప్రజల ప్రాణ భద్రతపై ఎలాంటి రాజీ ఉండదన్న సీఎం చంద్రబాబు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
Kurnool Bus Accident Latest Updates: కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్.
- పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు.
- ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు.
- మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని సీఎం ఆదేశశం.
- గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖకు సూచనలు.
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్‌నెస్, సేఫ్టీ , పర్మిట్ తనిఖీలకు ఆదేశాలు.
- అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఆదేశం.
- ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం ఏదైనా తేలితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక.
- ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
- మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారని వెల్లడి.
- ప్రైవేట్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ , పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక కోరిన సీఎం.
- రాష్ట్ర ప్రజల ప్రాణ భద్రతపై ఎలాంటి రాజీ ఉండదన్న సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
Kurnool Bus Accident Latest Updates: చిన్నటేకూరు వద్ద NH 44లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అగ్నిప్రమాదంలో చిక్కుకుని 20 మందికి పైగా ప్రయాణికులు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన ప్రయాణికులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ సంతాపాన్ని తెలిపారు.
Kurnool Bus Accident Latest Updates: కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర ద్రిగ్బాంతికి గురి చేసింది - మంత్రి పొన్నం ప్రభాకర్
==> కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది
==> మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..
==> బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది
==> తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం
==> ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో టెలిఫోన్లో మాట్లాడాం..
==> ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు
==> భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం..
==> త్వరలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులం రవాణా శాఖ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేస్తాం..
==> స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం
==> బస్సులపై రోజువారి రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులు అంటున్నారు.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి
==> మృతుల కుటుంబాలకు మా సానుభూతి వ్యక్తం చేస్తున్న
==> క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాం
Kurnool Bus Accident Latest Updates: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.23,120 ఫైన్ చెల్లించాల్సి ఉంది. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది. ఇందులో 9 సార్లు నో ఎంట్రీ జోన్ చలాన్లు ఉన్నాయి.
Kurnool Bus Accident Latest Updates: ప్రమాదానికి గురైన బస్సు DD01N9490 నంబరుతో రిజిస్టర్ అయింది
- కావేరి ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు
- 2018 మే 2న డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు.. 2030 ఏప్రిల్ 30 వరకు టారిస్ట్ పర్మిట్ జారీ అయింది - ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది.. ప్రమాదానికి గురైన బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్ ఉంది.
- 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్స్యూరెన్స్ ఉంది.. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు -అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం.. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు : ఏపీ రవాణాశాఖ
Kurnool Bus Accident Latest News: కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం : ప్రధాని మోదీ
Kurnool Bus Accident Latest News: ప్రమాదానికి గురైన బస్సులో అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్(28), యువన్ శంకర్‌రాజు (22), తరుణ్(27), ఆకాశ్(31), గిరిరావు (48), బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41) రమేష్(30) అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, అనూష(22), మహ్మద్ ఖైజర్ (51), దీపక్ కుమార్ (24), అన్డోజ్ నవీన్‌కుమార్ (26), ప్రశాంత్ (32), ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), జయసూర్య(24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కె.అశోక్ (27), ఎం.జి.రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్ కుమార్ (18), వేణుగోపాల్‌రెడ్డి (24) ప్రయాణించినట్లు తెలుస్తోంది.
జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హరిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేశ్, సుబ్రమణ్యం ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు.
Kurnool Bus Accident Latest News: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.
— Lokesh Nara (@naralokesh) October 24, 2025
Kurnool Bus Accident Latest News: "కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను." అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025
Kurnool Bus Accident Latest News: ప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు కర్నూలు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బస్సు ప్రయాణకుల బంధువులు 08518-277305 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Kurnool Bus Accident Latest News: హైదరాబాద్ నుంచి బస్సులో కూకట్ పల్లి నుంచి ఆరుగురు
కుత్బుల్లాపూర్ నుంచి నలుగురు
ఎస్ఆర్ నగర్ నుంచి ముగ్గురు
ఎర్రగడ్డ నుంచి ఇద్దరు
మూసా పేట్ నుంచి ఇద్దరు
భరత్ నగర్ నుంచి ఒక్కరు
వనస్థలిపురం నుంచి ఇద్దరు
ప్యారడైజ్ నుంచి ఇద్దరు
నాంపల్లి నుంచి ఒక్కరు
లక్డీకపూల్ నుంచి ఇద్దరు
ఎల్బీ నగర్ ఒక్కరు
Kurnool Bus Accident Latest News: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నారాయణ
- ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి
- బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నాం: నారాయణ
The loss of lives in a tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured.
— President of India (@rashtrapatibhvn) October 24, 2025
Kurnool Bus Accident Latest News: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరిటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు.
Kurnool Bus Accident News Live Updates: బస్సు ప్రమాద దుర్ఘటనకు డ్రైవర్ల సమన్వయ లోపం కారణం కావచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనుమానం వ్యక్తం చేశారు. బస్సు బైకును ఢీకొన్న విషయాన్ని డ్రైవర్ సెకండ్ డ్రైవర్‌కు చెప్పగా సమన్వయ లోపంతో చిన్న ప్రమాదంగా భావించారన్నారు. ఈ సమయంలోనే కింద నుంచి మంటలు నిమిషాల్లో చుట్టుముట్టాయని వెల్లడించారు. ప్రస్తుతం సెకండ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు.
Kurnool Bus Accident News Live Updates: చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం.. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్‌లో ఎక్కిన ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి.. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.
Kurnool Bus Accident News Live Updates: కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి
బైక్ బస్సు కిందకు వెళ్లడంతో.. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది - కలెక్టర్ సిరి
20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు- కలెక్టర్ సిరి
ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశాం- కలెక్టర్ సిరీ
ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు
20 మంది క్షేమంగా బయటపడ్డారు- కలెక్టర్ సిరి
Kurnool Bus Accident News Live Updates: నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- కర్నూల్ జిల్లా బస్సు దగ్ధమైన ఘటనలో మృతి చెందిన రమేష్ (37) గోళ్ళ అనూష (32), మనీష్ (12) మణీత్వా (10)
- గత 15 ఏళ్లుగా బెంగళూరులోని హిందుస్థాన్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న రమేష్
- కంపెనీ ట్రిప్పులో భాగంగా హైదరాబాద్ వెళ్లిన కుటుంబ సభ్యులు
Kurnool Bus Accident News Live Updates: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
- సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు దుబాయ్ పర్యటనలో ఉన్న టీజీ భరత్
- ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి
- ఘటనలో పలువురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టీజీ భరత్
Kurnool Bus Accident News Live Updates: గాయాలతో బయటపడినవారిలో జస్మిత, అకీర, రమేశ్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్, నవీన్ కుమార్, అఖిల్, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kurnool Bus Accident News Live Updates: కర్నూలులో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.
Kurnool Bus Accident News Live Updates: ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూల్ పెద్దాసుపత్రికి తరలించారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.
Kurnool Bus Accident News Live Updates: బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లడంతో మంటల మరింత చెలరేగినట్లు తెలుస్తోంది. బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అర్ధరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోయారు.
Kurnool Bus Accident News Live Updates: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌ను బైక్‌ను ఢీకొనగా.. బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా.. కర్నూలుకు దగ్గరలోని చిన్నటేకూరు వద్ద నేషనల్ హైవే 44పై ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఢీకొట్టిన బైక్.. ముందు భాగంలోకి దూసుకువెళ్లి డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొందరు బయటకు దూకి ప్రాణాలను రక్షించుకోగా.. కొందరు సజీవ దహనం అయ్యారు. కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.