Add Zee Business As A Preferred Source
App
Live Now

Montha Cyclone Live Updates: మొంథా బీభీత్సం.. ఏపీలో భయం భయం..

Montha Cyclone Live Updates: మొంథా తుపాను ఎఫెక్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల భారీ ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికపుడు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నారు.

Montha Cyclone Live Updates: మొంథా బీభీత్సం.. ఏపీలో భయం భయం..
Image Credit: Montha Cyclone
29 October 2025 01:17 PM (IST)

విశాఖ ఫోర్ట్ లో కొనసాగుతున్న 9వ ప్రమాదా హెచ్చరిక

జట్టికే పరిమితమైన షిప్పులు, నౌకలు, పడవలు

మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్లనివ్వకుండా తొమ్మిదవ ప్రమాదం హేచ్చరిక  జారీ చేసిన వాతావరణ శాఖ

మరో రెండు రోజులపాటు మత్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించిన వాతావరణ శాఖ

మొంథా తుఫాన్ గాలులకు మోపిదేవి మండలం బొబ్బర్లంకలో కృష్ణానది కరకట్టపై చెట్లు విరిగి పడిపోయాయి. ఈ సందర్భంగా చేపట్టిన సహాయక చర్యలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు పరిశీలించారు.

29 October 2025 01:17 PM (IST)

నందిగామలో  ఎమ్మెల్యే  సౌమ్య పర్యటించారు....

నందిగామలో  ఎమ్మెల్యే  సౌమ్య పర్యటించారు.

స్థానిక చందాపురంవాగు, రమణ కాలనీ వాగు,పునరావాస కేంద్రం పరిశీలన చేసారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో ఎమ్మెల్యే సౌమ్య బుధవారం పర్యటించారు. నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేశారు. 

తుఫాన్ ప్రభావం తో వర్షపు నీరు చేరిన చోట తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులతో చర్చించారు. 

నందిగామ పట్టణంలోని ఏర్పాటు చేసిన దేవినేని వెంకటరమణ కాలనీలో  పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని పలుకరించారు. అక్కడ వారికి కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. 

వర్షం తగ్గేవరకూ, తుఫాను ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకూ పునరావాస కేంద్రాలలోనే ఉండాలని వారికి సూచించారు. 

ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

 ఈ కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, ఏసీపీ తిలక్, ఎమ్మార్వో సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, కూటమి నేతలు, పోలీస్ యంత్రాంగం, తదితర అధికారులు పాల్గొన్నారు

29 October 2025 12:41 PM (IST)

విశాఖ ఆర్కే బీచ్ ఆరు అడుగులు మేర కోతకు గురి...

విశాఖ ఆర్కే బీచ్ ఆరు అడుగులు మేర కోతకు గురి

పది అడుగుల మేర ఎగసిపడుతున్న అలలు

గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

అక్కయ్యపాలెం, మధురవాడ, గాజువాక, సింహాచలం, జాలరిపేట, ప్రాంతాల్లో వర్షాలు

అలల దాటికి కోతకు గురైన ఆర్కే బీచ్

ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు కోత గురైన సముద్రం దాదాపుగా పది అడుగులు ముందుకు వచ్చిన సముద్రం

పర్యాటకులు ఎవరు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు

 

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి.

ప్రకృతి విపత్తును సమిష్టిగా ఎదుర్కొన్నాం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

కొండపల్లి మున్సిపాలిటీలో పర్యటన

ప్రకృతి విపత్తు మొంథా తుఫానును సమిష్టి కృషితో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని,  దీని ప్రభావంతో నేడు బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. 

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్టీ కాలనీ, వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ బుధవారం పర్యటించారు. డ్రైనేజి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపాలిటీ సిబ్బందికి సూచించారు. శాంతినగర్ శివార్లలో బుడమేరు డైవర్షన్ ఛానెల్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి మొంథా తుఫాన్ తీరం దాటిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సమిష్టిగా పని చేసి ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం లేకుండా కృషి చేసిందన్నారు.

తాజాగా కురుస్తున్న భారీవర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది పూర్తి సమన్వయం, అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

గత వరదలను దృష్టిలో ఉంచుకుని వెలగలేరు హెడ్ రెగ్యులేటర్, బుడమేరు డైవర్షన్ ఛానల్ పై నిరంతరం నిఘా ఉంచామన్నారు. బుడమేరు నీటి ప్రవాహానికి అడ్డంకి లేకుండా చర్యలు చేపట్టామన్నారు. బీడీసీ ద్వారా వరదనీరు కృష్ణానదికి వెళ్తోందన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.

సీఎం చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామం, మండలం, పట్టణంలో ప్రత్యేక ప్రతిస్పందన బృందాలను (రెస్పాన్స్ టీమ్స్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, తుపాను ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. 

మైకులలో అనౌన్స్ మెంట్  ద్వారా  ప్రజలకు తుపాను ప్రమాద తీవ్రతను తెలియజేసినట్లు పేర్కొన్నారు. వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంగా ఉన్న వారిని  వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. 

వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా పునరావాస కేంద్రాల్లో 24 గంటలూ సిబ్బందిని ఉంచి, తగిన మందులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 

మైలవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన  పునరావాస కేంద్రాల్లో వీరికి నాణ్యమైన ఆహారం, తాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

వాగులు, వంకలు పొంగినప్పుడు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చెరువులు, కాల్వగట్లు గండ్లు పడితే వెంటనే మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

రహదారులు కోతకు గురైనా, చెట్లు విరిగిపడినా వెంటనే సరిదిద్దేందుకు అవసరమైన ట్రాక్టర్లు, జేసీబీలు, యంత్రాలను ముందే సమకూర్చుకుని సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

భారీ, అతి భారీ వర్షాలకు పంట నష్టం లేకుండా, పశుసంపద నష్టం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పైర్లు ముంపునకు గురికాకుండా కాల్వలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంచాయతీరాజ్, రహదారులు-భవనాలు, విద్యుత్తు శాఖలు నిరంతరం పరిస్థితుల్ని గమనిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యం సేవలను అందించారని, తుఫాను ముప్పు సమసిపోయే వరకూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు

29 October 2025 01:16 PM (IST)

అమరావతి..మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి...

అమరావతి..మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబబు

బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కొనసాగనున్న సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్

చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేయనున్న సీఎం

కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో ల్యాండ్ అవనున్న ముఖ్యమంత్రి

ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి

29 October 2025 12:43 PM (IST)

తుఫాన్ ఎఫెక్ట్.. లేటెస్ట్ అప్డేట్స్ ...

తుఫాన్ ఎఫెక్ట్.. లేటెస్ట్ అప్డేట్స్ 

వర్షాలకు విశాఖ ఆరిలోవ క్రాంతినగర్లో భారీ కొండచిలువ ప్రత్యక్షం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

నిండుకుండలా మారిన సోమశిల, రాళ్లపాడు, కండలేరు రిజర్వాయర్లు

గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు

మచిలీపట్నంలో భారీ వర్షం.. 500మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం

బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక

☔️ విశాఖపట్నం నగరంలో నిన్నటి సాయంత్రం నుండి భారీ నుండి అతి భారీ వర్షపాతం కురుస్తోంది, అనేక ప్రాంతాల్లో 100-120 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు అత్యధికంగా మహారాణిపేటలో 146 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీని తర్వాత, నగరంలో కనీసం తదుపరి 2 గంటల పాటు వర్షాలకు కొంత విరామం లభిస్తుంది. ఆ తర్వాత, తుఫాను పైకి కదులుతున్నప్పుడు, వర్షాలు మళ్లీ పుంజుకుంటాయి

29 October 2025 12:40 PM (IST)

వర్షంలో సైతం డ్రైనేజీ సమస్యల పరిష్కారం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రోడ్ల...

వర్షంలో సైతం డ్రైనేజీ సమస్యల పరిష్కారం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు, చెట్లు విరిగి విద్యుత్ అంతరాయ వంటి పనులను పరిశీలించి తక్షణమే వీటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన -MLA బొండా ఉమ తుఫాను అనంతర పునరుద్ధరణ పనులను కూడా వేగవంతం చేసి, సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంధి -MLA బొండా ఉమ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులను సంప్రదించాలి సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో మొంథా (Montha) తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో డ్రైనేజీ సమస్య ఒకటి, ఈ సమస్యను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు వెంటనే, హుటాహుటిన సంబంధిత అధికారులతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలను సమీక్షించి, ప్రజలకు భరోసా కల్పించారు... ఈ పర్యటనలో, డ్రైనేజీ వ్యవస్థలో ఏర్పడిన అడ్డంకులు, నీటి నిల్వలు, మరియు చెట్లు పెరిగి కరెంటు తీగలపై పడటం వంటి సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు.. ఈ సమస్యల తీవ్రతను గుర్తించిన ఆయన, తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు... మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో, మంత్రులు, పార్లమెంటు సభ్యులు (MPలు), శాసనసభ్యులు (MLAలు), జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు (SPలు), మరియు మొత్తం అధికార యంత్రాంగం గత మూడు రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని తెలియజేశారు. ఈ సమష్టి కృషికి ప్రతిఫలమే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణ నష్టం గానీ, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం గానీ జరగకుండా నివారించగలిగామని, తుఫాను హెచ్చరికలు అందినప్పటి నుండి, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించిందని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడం, ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను అందించడం వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించామని... ప్రభుత్వం చేపట్టిన ఈ విస్తృతమైన సహాయక చర్యల వల్లనే తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు పెద్దగా నష్టం వాటిల్లలేదని బొండా ఉమా గారు పునరుద్ఘాటించారు, ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, అధికారుల అంకితభావం, మరియు ప్రజల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా, ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రజలకు అండగా నిలుస్తుందని... డ్రైనేజీ సమస్యల పరిష్కారం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి, పునరుద్ధరణ పనులలో భాగస్వామ్యం కావాలని, ఈ విపత్కర పరిస్థితులలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని బొండా ఉమా గారు భరోసా ఇచ్చారు. ఈ కష్టకాలంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులను సంప్రదించాలని, తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు..

29 October 2025 11:55 AM (IST)

కాకినాడ జిల్లా…జగ్గంపేట...

కాకినాడ జిల్లా…జగ్గంపేట

మొoధా తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు

జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో మొoధా తుఫాన్ కారణంగా పలు పంటలకు తీవ్ర నష్టం

కోత దశలో ఉన్న వరి చేను, మొక్కజొన్న, మునగ పంటలకు నష్టం..

ఉల్లి శెట్టి శ్రీను అనే రైతు తన ఎకరం పొలంలో వేసుకున్న మునగ తోట మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గాలికి మునగ తోట విరిగిపోయింది

ఎకరానికి 40 నుండి 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టామని  ఈ అకాల వర్షం వల్ల చేతికి అందివస్తున్న పంట నేలపాలు అయిందని వాపోయారు... 

 ప్రభుత్వం తమ లాంటి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు

29 October 2025 11:51 AM (IST)

మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి వరంగల్ ను తాకింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా...

మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి వరంగల్ ను తాకింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్య సంస్థలకు సెలవులు ప్రకటించారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మంత్రులు కలెక్టర్ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు మొంథా తుఫాన్ ప్రభావం పై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో నిలిచిపోయిన ఆన్ లైన్ సేవలు.

ఉదయం నుండి ఆన్లైన్ సేవలు మొరాయిస్తుండడంతో నిలిచిన రక్త పరీక్షలు.

ఆన్లైన్ సమస్యతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు.

 

29 October 2025 11:51 AM (IST)

అమరావతి.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు ఏరియల్...

అమరావతి.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

తుఫాను నష్ట నివారణ చర్యలను వెంటనే ప్రారంభించండి

అన్ని గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దండి

తుఫాన్ అనంతరం తీసుకోవలసిన చర్యలపై ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

➖ అన్ని గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలి : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

➖ గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి కలిగిన విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పునరుద్దరించాలి...

➖ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించి ఎవరు కూడా అటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

➖ డ్రోన్ విజువల్స్ తీసి బ్లాక్ అయిన రోడ్లను గుర్తించి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి

➖ ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రధాన ఆసుపత్రి తో పాటు అన్ని పిహెచ్సిలలో వైద్యులు అందుబాటులో ఉండాలి

➖ ఎక్కడైనా తాగునీరు కలుషితమైతే ఆ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలి

➖ పోలీసు, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తుఫాన్ అనంతర నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టాలి : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

29 October 2025 11:17 AM (IST)

అమరావతి..తుపాను తీరం దాటాక తదనంతర పరిస్థితులపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్...

అమరావతి..తుపాను తీరం దాటాక తదనంతర పరిస్థితులపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

- ప్రభావం చూపిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం.

- నష్టం అంచనాపై త్వరితగతిన నివేదికలు రూపొందించేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు.

గవరజగ్గయ్య పాలెం  నీట మునిగిన ఇల్లులు  ఇంటిలోకి వెళ్ళటానికి వీలు లేక  ఇబ్బందులు పడుతున్న ప్రజలు....

మరో పక్క పాములు సంచారం
భయందాళానా లో ప్రజలు

 తక్షణమే స్పందించి జీఎంసీ అధికారులు నీటిని పోయేలా చేయాలంటూ ప్రజల అభ్యర్ధన

29 October 2025 11:18 AM (IST)

కృష్ణాజిల్లా మచిలీపట్నం..  పునరావాస కేంద్రాల్లో బాధితులకు భరోసా ఇస్తున్న...

కృష్ణాజిల్లా మచిలీపట్నం..  పునరావాస కేంద్రాల్లో బాధితులకు భరోసా ఇస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర 

పునరావస కేంద్రాల్లో తలదాచుకున్న లోతట్టు ప్రాంత ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇస్తున్నారు 

మొంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పరిసర గ్రామాల్లో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి
 
ఆ కేంద్రాలను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం సందర్శించారు ఆ కేంద్రాల్లో ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అక్కడ ఏర్పాటు చేసిన వసతులు గురించి ఆరా తీశారు

పునరావాస కేంద్రాల్లో మంచి ఆహారం ఏర్పాటు చేయాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు

లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తుఫాను ప్రమాదం తప్పిందని వర్షాలు గాలుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లనా  ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 

ధైర్యంగా ఉండాలని తమ ఇళ్లకు వెళ్లే వరకు అన్ని వసతుతో పునరావస  కేంద్రాలలో బాగోగులు చూస్తామన్నారు. 

 అందర్నీ పరామర్శిస్తూ అందరికీ అభయమిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర బందరు మండలంలో పర్యటించారు.

రెండు రోజులుగా మచిలీపట్నంలో నే ఉంటూ తుఫాను పరిస్థితిని ఆయన సమీక్షించారు.

 ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు .

ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడాలని చెప్పడంతో అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

దీనికి తోడు కలెక్టర్ బాలాజీ నిర్విరామంగా తుఫాను సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం కావడం ఎప్పటికప్పుడు అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు.

29 October 2025 10:37 AM (IST)

బ్రహ్మంగారిమఠం లో  వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి...

బ్రహ్మంగారిమఠం లో  వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం కూలింది..

బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడుకో లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు..

బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి నివాస గృహాన్ని సందర్శిస్తారు..

కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామన్న అధికారులు నివాస గృహం పట్ల అలసత్వం వహించడంతోనే కూలింది అంటున్న భక్తులు..

అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నా నివాస గృహం కూలిపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని అంటున్న భక్తులు.

29 October 2025 10:31 AM (IST)

మోంథా తూఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై కొద్దిపాటి నష్టమే చేకూర్చడంతో ప్రజలు...

మోంథా తూఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై కొద్దిపాటి నష్టమే చేకూర్చడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి మహత్యంతో రాజోలు ప్రాంతం విపత్తు నుంచిగట్టెక్కిందని  కోనసీమకు చెందిన భక్తులు భావిస్తున్నారు. మొదట కాకినాడ వద్ద ర్వాత అమలాపురం - రాజోలు మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేశారు. గత రాత్రి అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకినట్లుగా ప్రచారం జరిగి  చివరికి దిశ మార్చుకుని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటినట్లుగా భారత వాతావరణ శాఖ ద్వారా వెల్లడి తెలిపింది.  ఈ నేపథ్యంలో రాజోలు దీవి ప్రాంతంలో సముద్ర తీరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోనసీమకు ఎలాంటి విపత్తు రాకుండా కాపాడారని భక్తులు భావిస్తున్నారు. విపత్తు నుంచి తమ ప్రాంతాన్ని కాపాడినందుకు మలికిపురం మండలం మేడిచర్లపాలెంకు చెందిన భక్తులు పాదయాత్రగా అంతర్వేది ఆలయానికి బయలుదేరారు. 

29 October 2025 10:20 AM (IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

తుపాను తరువాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు

•    వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.

•    అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు  తిరిగి వెళ్ళవద్దు.

•    విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు /తెగిన తీగలు మరియు ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి.   

•    దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు.

•    దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించండి.

29 October 2025 10:19 AM (IST)

మొంథా సూపర్ సైక్లోన్.....

మొంథా సూపర్ సైక్లోన్..
ప్రభావంతో ఇప్పటికే మూడు రోజులుగా ఈ నెల 26.  27, 28 తేదీల్లో విద్యాలయాలు మూత పడ్డాయి. 
ఇపుడు అక్టోబర్ 29, 30, 31వ తేదీ కూడా సెలవులుగా పేర్కొంటూ ఏపీ సర్కారు నుంచి ఆదేశాలు ఇచ్చారు!

విశాఖ ఆర్కే బీచ్ ఆరడుగుల మేర కోతకు గురి

పది అడుగుల మేర ఎగసిపడుతున్న అలలు

గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

అక్కయ్యపాలెం, మధురవాడ, గాజువాక, సింహాచల ప్రాంతాల్లో వర్షాలు

అలల దాటికి కోతకు గురైన ఆర్కే బీచ్..

 

 

29 October 2025 10:19 AM (IST)

అనకాపల్లి జిల్లా.....

అనకాపల్లి జిల్లా..

చోడవరం మండలం భోగాపురంలో  భయాందోళనలో స్థానికులు

మొంథా తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షం

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి పెరిగిన వరద నీరు  

వరద నీరు తాకిడి కారణంగా ఉడేరు నదికి పడిన  గండి 

ఉడేరు నదికి గండి పడడంతో పంట పొలాల్లోకి వస్తున్న వరద నీరు

ఆందోళన చెందుతున్న భోగాపురం చాకిపల్లి రైతులు

వరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాసం

29 October 2025 09:52 AM (IST)

పల్నాడు జిల్లా ...

పల్నాడు జిల్లా 

చిలకలూరిపేట పట్టణంలో మొంథ తుఫాన్ ఎఫ్ఫెక్ట్ 

 పట్టణంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం 

 నీట మునిగిన జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న సంజీవ్ నగర్ 

 కాలనీలోని రోడ్లన్నీ జలమయం

 పట్టణంలో ని పలు ప్రాంతాల్లో నీట మునిగిన కాలనీ లు

 వర్షపునీరు తో నీట మునిగిన ఎన్టీఆర్ కాలనీ, శాంతి నగర్, భావనా రుషి నగర్,రూత్ డైకెమేన్ నగర్, అడ్డ రోడ్డు వద్ద వద్ద వినాయక నగర్  ప్రాంతాలు

 ఇంటి చుట్టూ వరద నీరు ఉండడం తో ఇంటి బయటకు రాలేక అవస్థలు పడుతున్నా ఆ ప్రాంతాల వాసులు

29 October 2025 09:44 AM (IST)

నరసరావుపేట-చిలకలూరిపేట రహదారిపై నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం వద్ద పొంగి...

నరసరావుపేట-చిలకలూరిపేట రహదారిపై నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం వద్ద పొంగి ప్రవహిస్తున్న కొండ వాగు కాలువ. చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలో స్తంభించిన వాహన రాకపోలు.సాతులూరు-దింతెనపాడు ఆర్.బీ రహదారిపై నాదెండ్ల-తూబాడు మధ్య ఉధృతంగా ప్రహహిస్తున్న దంతెల వాగు. నిలిచిన వాహన రాకపోకలు.

మొంథా తుఫాన్ ఎఫెక్ట్ 

విరిగిన చెట్లు కరెంటు స్తంభాలు... తప్పిన ప్రమాదం 

వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ పంచాయతీ ఎలక్ట్రికల్ శాఖ అధికారులు 

పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి లోని ఎన్టీఆర్ బొమ్మ వద్ద ప్రధాన రహదారి పైన విరిగిన చింత చెట్టు కరెంటు పోల్ 

చింతచెట్టు విరగడంతో రోడ్డు పక్కనే బడ్డీ బంకు పూర్తిగా ధ్వంసం 

 విద్యుత్ పోల్ విరగటంతో భయబ్రాంతులకు గురైన ఆ ప్రాంతవాసులు  అప్రమత్తమైన విద్యుత్ శాఖ 

జోరు వాళ్లను సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న రెవిన్యూ పంచాయతీ శాఖ అధికారులు 

విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న విద్యుత్ శాఖ అధికారులు.

29 October 2025 09:43 AM (IST)

తుఫాన్ ప్రభావం వల్ల చలికి తట్టుకోలేక ఇద్దరు మృతి .....

తుఫాన్ ప్రభావం వల్ల చలికి తట్టుకోలేక ఇద్దరు మృతి ..

బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకి పట్టణం 20వ వార్డు నందు రాత్రి ఏకధాటిగా పడుతున్న వర్షాలు మరియు ఈదురు గాలుల వల్ల చలికి తట్టుకోలేక వనపర్తి హనుమంతరావు 75/W రేకునార్ లక్ష్మీ  65/W  అను ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు వార్డు ప్రజలు తెలిపారు. 20 వార్డు నందు సరిగా ఇల్లు లేని కొందరు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరారు , ఘటన స్థలాన్ని చేరుకున్న మునిసిపల్ కమిషనర్ , డి రవీంద్ర పట్టణ సీఐ సుబ్బరాజు , రెవెన్యూ అధికారులు ఆ ఇద్దరు మృతుల వివరాలు  సేకరణ చేపట్టారు

29 October 2025 08:35 AM (IST)

తీరం దాటిన మొంథా తీవ్ర తుపాను ...

తీరం దాటిన 'మొంథా' తీవ్ర తుపాను 

తీరం దాటిన 'మెుంథా' తీవ్ర తుపాను

నరసాపురం వద్ద తీరం దాటినట్లు ప్రకటించిన ఐఎండీ

అర్ధరాత్రి 11.30-12.30 మధ్య తీరం దాటిన తీవ్ర తుపాను

భూభాగంపై బలహీనపడనున్న 'మెుంథా' తుపాను

రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు

రాగల 24 గంటల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు

తీరం దాటినా భూభాగంపై తుపానుగా కొనసాగుతున్న 'మెుంథా'

ఉత్తర వాయవ్యంగా తెలంగాణ మీదుగా పయనిస్తున్న మెుంథా

ఇవాళ మధ్యాహ్నానికి ఛత్తీస్‌గఢ్‌ వద్ద బలహీనపడనున్న మెుంథా

'మెుంథా' తీవ్రతుపాను తీరం దాటినా కొనసాగుతున్న గాలుల ప్రభావం

గంటకు 85-95 కి.మీ. వేగంతో కొనసాగుతున్న ఈదురుగాలులు

గరిష్ఠంగా గంటకు 105 కి.మీ. వేగంతో కొనసాగుతున్న ఈదురుగాలులు

తీరం దాటిన సమయంలో గంటకు 12 కి.మీ. వేగంతో కదిలిన 'మెుంథా'

ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ

గడిచిన 12 గంటల్లో కావలిలో అత్యధికంగా 23 సెం.మీ వర్షపాతం

గడిచిన 12 గంటల్లో ఉలవపాడులో 17 సెం.మీ వర్షపాతం నమోదు

గడిచిన 12 గంటల్లో చీరాలలో 15 సెం.మీ వర్షపాతం నమోదు

29 October 2025 08:33 AM (IST)

రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం...

రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం

- దీని ప్రభావంతో  ఇవాళ రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

- కోస్తాంధ్రలో ఈదురుగాలులు 

- ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం 

- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు

- కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం 

- నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం

 

29 October 2025 08:30 AM (IST)

ఏపీని వణికిస్తున్న  మెంథా తుఫాను ఇప్పుడు తన పూర్తి ప్రభావాన్ని...

ఏపీని వణికిస్తున్న  'మెంథా' తుఫాను ఇప్పుడు తన పూర్తి ప్రభావాన్ని తెలంగాణపై చూపిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 8-12 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, యాదాద్రి - భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాను నేడు మధ్యాహ్నం నాటికి ఛత్తీస్‌గఢ్‌ వద్దకు చేరుకుని మరింత బలహీనపడనుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Add Zee News as a Preferred Source

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More