)
Srikakulam Stampede Live Updates: శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు. ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు. హరిముకుంద్ పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం. ఈ దేవాలయ సామర్థ్యం 2 వేల నుంచి 3 వేల మంది వరకు మాత్రమే ఉంది. ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు వచ్చారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కానీ సదరు వ్యక్తి చేయలేదు. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణం. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చిన నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం నా మనసును కలచివేసింది.
మరణించిన భక్తుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని… pic.twitter.com/yAQXivLxHg
— PVN Madhav (Modi Ka Parivar) (@MadhavBJP) November 1, 2025
Srikakulam Stampede Live Updates: కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్
- హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్
- విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు
- తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు
- మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు
- బాధితులను ఆదుకునేందుకు చేసే సహాయం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తారు.
Srikakulam Stampede Live Updates: శ్రీకాకుళం కాశీబుగ్గ దుర్ఘటనకు సంబంధించి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 08942 240557 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
Srikakulam Stampede Live Updates: "ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా,గాయపడిన వారికి రూ. 50,000 మంజూరు చేస్తున్నాం.." ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కాశీబుగ్గలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవటం నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ…
— Jagat Prakash Nadda (@JPNadda) November 1, 2025
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది . అత్యంత విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం.…
— YS Sharmila (@realyssharmila) November 1, 2025
Srikakulam Stampede Live Updates: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విచారకరమని.. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోందని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని తమ పార్టీకి చెందిన నాయకులను ఆదేశించినట్లు చెప్పారు.
"తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది మరణించారని మీడియా ద్వారా సమాచారం వస్తోంది. ఈ 18 నెలల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థం అవుతోంది. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. చంద్రబాబుగారి అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లుతెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి." అని జగన్ అన్నారు.
Srikakulam Stampede Live Updates: వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటనలో 10 మంది చనిపోయారని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆలయాల్లో భద్రతపై ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నామని తెలిపారు. కానీ నిర్వాహకులు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. అక్కడ ఏం జరుగుతోందనేది వారే చూసుకోవాలని, స్థానిక అధికారులకు సమాచారమిస్తే భద్రత కల్పిస్తారని అన్నారు.
Srikakulam Stampede Live Updates: "శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేయడమైంది. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుంది. ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుంది.
కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తున్నాను. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి.." అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
Srikakulam Stampede Live Updates: పవిత్రమైన ఏకాదశి రోజు గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన కాశీబుగ్గ వేంకటేశ్వరాలయం తొక్కిసలాటతో బాధితుల హాహాకారాలతో హృదయ విదారకంగా మారింది. ఆలయ పరిసరాలు భక్తుల ఆర్తనాదాలతో నిండిపోయాయి. భక్తుల రాకను అంచనా వేయడంలో విఫలమైన అధికారులు ఒక్కసారిగా దర్శనానికి గేట్లు ఓపెన్ చేయడంతో తోపులాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే 9 మంది ప్రాణాలు విడిచారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
🚨 Tragedy in #Srikakulam: A deadly crowd crush at Kasibugga Venkateswara Swamy Temple during Ekadashi leaves 9 dead and several injured.
Devotees allege poor crowd management led to the incident. #Srikakulam #AndhraPradesh #KasibuggaTemple pic.twitter.com/w1Ax1PntNF— Madhuri Adnal (@madhuriadnal) November 1, 2025
Srikakulam Stampede Live Updates: సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
- కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన నన్ను తీవ్రంగా బాధించింది
- మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
- భక్తుల ప్రాణనష్టానికి కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట.
Srikakulam Stampede Live Updates: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి
జరిగిన ఘటన గురించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి ఆనం
మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి ఆనం
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆనం ఆదేశం
Srikakulam Stampede Live Updates: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మంత్రి అనిత
ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి
ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులను సూచన.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలగా అండగా ఉంటుంది...హోం మంత్రి అనిత.
Srikakulam Stampede Live Updates: "కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గారితో, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారితో మాట్లాడాను. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించాను." అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Srikakulam Stampede Latest Updates: "శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను." అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Srikakulam Stampede Latest Updates: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం
దేవాలయానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి అచ్చెన్నాయుడు
ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ
బాధిత కుటుంబాలకు మంత్రి సానుభూతి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం చర్యలు సూచన
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యల్లో నిమగ్నం
సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు తరలింపు
ఆలయ ప్రాంతంలో క్షణాక్షణం సమీక్ష కొనసాగింపు
Srikakulam Stampede Live Updates: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెయిలింగ్ ఊడిపోవడంతో భక్తులు కిందపడిపోయారు. అంచనాలకు మించి భక్తులు తరలి రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పలువురు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.