Add Zee Business As A Preferred Source
App
Live Now

Telugu States Rain Alert Live: ఏపీకి రెడ్ అలర్ట్.. తీరం వైపు తుపాను.. నాలుగు రోజులు గడిస్తే చాలు..!

Telugu States Rain Alert Live: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో ఏపీకి మంతా తుపాను దూసుకువస్తోంది. ఈ యేడాది అత్యంత బలమైన తుపానుగా మారబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగు రోజులు పాటు ఏపీలో భీకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు తెలంగాణను వర్షాలు ముంచెత్తనున్నాయి.

 Telugu States Rain Alert Live: ఏపీకి రెడ్ అలర్ట్.. తీరం వైపు తుపాను.. నాలుగు రోజులు గడిస్తే చాలు..!
Image Credit: Mantha Toofan
25 October 2025 02:58 PM (IST)

తెలంగాణ  రాష్ట్రంలో రాగల మూడు రోజుల  వరకు వాతావరణ విశ్లేషణ మరియు...

తెలంగాణ  రాష్ట్రంలో రాగల మూడు రోజుల  వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు : 
వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : (ఈరోజు ఉదయం 08:30 ఆధారంగా) :
 నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడన ప్రాంతం నిన్న సాయంత్రం 17:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారి తదుపరి పశ్చిమ దిశలో కదిలి ఈరోజు ఉదయం 05:30 గంటలకు ఇంచుమించు అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. ఆ తర్వాత  ఈ వాయుగుండం ఇంచుమించు పశ్చిమ దిశలో గంటకు సుమారు గంటలకు 7 కిలో మీటర్ల  వేగంతో కదిలి ఈరోజు ఉదయం 08:30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో 10.8N అక్షాంశం, 88.8E రేఖాంశం ప్రాంతంలో విశాఖపట్నం కి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, చెన్నైకి, తూర్పు, ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

రాగల 24 గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడనుంది.   రేపు 26 అక్టోబర్ నాటికి తీవ్రవాయుగుండం గానూ ఎల్లుండి 27 అక్టోబర్ ఉదయానికి తుఫానుగాను మారి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది.
ఆ తర్వాత తుపాను వాయువ్యదిశలో కదిలి మరింత బలపడి 28 అక్టోబర్ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి ఈ తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశలో కదిలి కోస్తా ఆంధ్ర తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకు సమీపంలో 28 అక్టోబర్ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో ఈదురు గాలుల వేగము గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది.* 

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):

ఈరోజు, రేపు  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాష్ట్రం లోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు ..    

ఎల్లుండి  తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, ఈశాన్య  జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 
ఈరోజు,రేపు మరియు ఎల్లుండి  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది

25 October 2025 11:52 AM (IST)

విశాఖ పట్నం.. ...

విశాఖ పట్నం.. 

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ,మండల అధికారులతో కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్.

జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్

 బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు)అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి.

ఆస్తి,ప్రాణ, పశు , పంట నష్టం జరగ కుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే (హెడ్ క్వార్టర్స్ లో) ఉండాలి.

ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయ బడవు.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలి

ఎవరైనా ఇప్పటికీ సముద్రంలోకి  వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలి.

తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు  వచ్చే అవకాశం ఉన్నందున 

నది ఒడ్డులో, కొండ వాలులలో,  నీటిమంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు  చేరుకోవాలి.

పల్లపు ప్రాంతాల్లో నీరు చేరితే వెంటనే నీటి తొలగింపు కు అన్ని ఏర్పాట్లు చేసు కోవాలి.

అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి.

చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి.

త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి.

విద్యుత్ కి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలి.

జనరేటర్లు,డీజిల్ అందుబాటు లో  సిద్ధం గా ఉంచు కోవాలి.

ఎన్ డి ఆర్ ఎఫ్ ఎస్ టి ఆర్ ఎఫ్ టీమ్ లను సిద్ధంగా ఉంచాలి.

జిల్లా కలెక్టరేట్లో ,ఆర్డీవో కార్యాలయాలలో, తాసిల్దార్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు  చేసి ప్రజలకు తెలపాలి.

25 October 2025 11:18 AM (IST)

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మేగాద్రి గడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తు...

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మేగాద్రి గడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

రిజర్వాయర్ నీటిని విడుదల చేసే గేటు వద్ద గుర్తు తెలియని మృతదేహం..

స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు..

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు...

మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది..

25 October 2025 11:02 AM (IST)

Tirumala Rains:తుఫాన్ కారణంగా తిరుమల లో వేకువజామున నుంచి  వర్షం పడుతుంది...

Tirumala Rains:తుఫాన్ కారణంగా తిరుమల లో వేకువజామున నుంచి  వర్షం పడుతుంది. వర్షం కారణంగా తిరుమల ఆలయం పరిసలప్రాంతాలు నిర్మానుషం గా మారింది. వాన చలి కి భక్తులు తీవ్రంగా అవస్తలు పడుతున్నారు. అఖిలండం పక్కన ఉన్న షాప్స్ వద్ద వానకి పడుకొన్నారు భక్తులు. తిరుమాడ విధుల్లో నీరు నిలిచిపోయింది. భక్తులకి వసతి దొరకని వారికి ప్రత్యామ్నాయం గా చర్యలు తీసుకోవాలని టీటీడీ ను భక్తులు కోరుతున్నారు. చంటి బిడ్డలు తో ఉన్న తల్లితండ్రులు త్రివం గా అవస్తలు పడుతున్నారు.

25 October 2025 10:46 AM (IST)

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం..ఇది పశ్చిమ-వాయువ్య దిశగా...

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం..ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా మారింది. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.  ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.  దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు..

ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపు నిచ్చారు. 

25 October 2025 09:25 AM (IST)

తిరుమలలో భారీ వర్షం.. శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది....

తిరుమలలో భారీ వర్షం.. శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. టోకోన్ ఉన్న భక్తులకు 2 గంటల్లో దర్శనం అవుతుంది. తిరుమలలో భారీ వర్షం నేపథ్యంలో ఘాట్ రోడ్లలో మట్టి పెళ్లలు, కొండ చరియలు విరిగిపడుతున్నాయి. టీటీడీ సిబ్బంది ఎప్పటికపుడు వాటిని తొలిగిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తోంది. 

25 October 2025 08:41 AM (IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాన్‌గా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్‌.....

బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాన్‌గా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్‌..

అల్పపీడనం సోమవారానికి తుఫాన్‌గా బలపడనుండటంతో అప్రమత్తమైన ఏపీ సర్కార్‌. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌, ఈడీ దీపక్‌, అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత.

25 October 2025 08:40 AM (IST)

అమరావతి .. దుబాయ్ పర్యటన ముగించుకుని హైద్రాబాద్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు...

అమరావతి .. దుబాయ్ పర్యటన ముగించుకుని హైద్రాబాద్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు

- పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజులపాటు దుబాయ్‌లో పర్యటన

- ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు బృందం

- గల్ఫ్‌ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ సమావేశమైన సీఎం

- ఏపీలో  పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన సీఎం

- నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న.. సీఐఐ ఇన్వెస్టర్స్‌ మీట్‌కు ఆహ్వానించిన చంద్రబాబు.

25 October 2025 08:19 AM (IST)

మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ,...

మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉండటంతో  చెట్లు, కరెంట్ పోల్స్ కింద   ప్రజలు అక్కడ ఉండరాదని సూచించారు. 

 

25 October 2025 07:58 AM (IST)

ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్,కాలేజీ, 28,29 తేదీల్లో...

ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్,కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించారు. మంతా తుపాను ప్రభావంతో  వాతావరణ శాఖ స్కూల్లకు సెలవులు ప్రకటించాలని అధికారులు సూచించారు.దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలని సూచిస్తున్నారు.  

25 October 2025 07:39 AM (IST)

మంతా తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో మత్స్య కారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది...

మంతా తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో మత్స్య కారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.తుపాను ప్రభావంతో గంటకు 70-100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్టు అధికారులు తెలిపారు. 

మరిన్ని అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Add Zee News as a Preferred Source

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More