ఆ ఊరు పేరు మార్చాలట..ఎందుకో తెలుసా ?

                                           

Last Updated : Jun 5, 2018, 07:35 PM IST
ఆ ఊరు పేరు మార్చాలట..ఎందుకో తెలుసా ?

ఎవరైనా తమ ఊరి పేరును గర్వంగా చెప్పుకుంటారు..కానీ ఆ ఊరోళ్ల పరిస్ధితి వేరు ..ఎక్కడికి వెళ్లినా తన పేరు చెప్పుకునేందేకు జంకుతారు.. ఇంతకీ ఏంటా ఊరి పేరు అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.

అనంతపురంలోని గుత్తికి 5 కి.మీ దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు 'కొజ్జేపల్లి'. అభివృద్ధి పథంలో ఆ ఊరు ఎప్పూడూ ముందంజలో ఉంటుంది. కానీ గ్రామస్థులకు తమ ఊరు పేరు చెప్పుకునేందుకు ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే ఆ ఊరి పేరు వింటేనే అక్కడందరూ హిజ్రాలే ఉంటారా ? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. 

ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

రాయల పాలన కాలంలో కొందరు హిజ్రాలు ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివసించే వారట. కాల క్రమంలో కొజ్జాపల్లిగా ఆపై కొజ్జేపల్లిగా ఊరి పేరు మారింది. ఇక గ్రామం పేరును మార్చాలని అధికారులకు స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి మొర పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ఆ గ్రామం పేరును 1980లోనే గాంధీ నగర్ గా మారుస్తున్నట్టు ప్రకటించిచాలని అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామయ్య జిల్లా కలెక్టర్ తదితర అధికారులకు లేఖలు రాయగా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు.

అధికారులకు గ్రామస్తుల మొర

బయటి వ్యక్తులకు తమ గ్రామం పేరు చెప్పుకోవాల్సి వస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. పేరు మార్చాలని పంచాయతీ తీర్మానం చేసినా ఫలితం లేకపోయిందని... ఇప్పటికైనా అధికారులు తమ  సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నారు.

Trending News